Prabhas (1)
Prabhas: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని, యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran). ఆరోజుల్లో చిరంజీవి కంటే ముందే 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను అందుకున్న నటుడు ఆయన. తొలి మూడు సినిమాలతోనే ఫిలిం ఫేర్ అవార్డ్స్, నంది అవార్డ్స్ ఇలా ఒక్కటా రెండా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు. టాలీవుడ్ లో మరో స్టార్ హీరో గా అవతరించే దిశగా ఉదయ్ కిరణ్ అడుగులు వేస్తున్న సమయంలో కొన్ని తప్పటడుగులు వేయడం వల్ల అతని జీవితమే సర్వ నాశనం అయ్యింది. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ని తల్చుకుంటే ఎవరి మనసు అయినా బాధతో నిండిపోతుంది. కల్ముషం లేని ఆ అమాయకమైన ముఖాన్ని, చిరునవ్వుని చూస్తే మన ఇంట్లో బిడ్డ మిస్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది.
వరుస ఫ్లాప్స్ రావడం వల్ల, సినిమా అవకాశాలు రాకపోవడం, అప్పుల పాలు అవ్వడం, భార్య సంపాదన మీదనే బ్రతకాల్సి రావడం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఛీత్కారాలు అనుభవించడం, ఇవన్నీ తట్టుకోలేక చివరికి ఉరి వేసుకొని చనిపోవడం వంటి ఘటనలు మన కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఉదయ్ కిరణ్ కొన్ని అనుకోని కారణాల వల్ల వదిలేసిన సినిమాల కారణంగా, వేరే హీరోలు ఆ సినిమాలు చేసి పెద్ద స్టార్ హీరో గా మారిపోయారు. అలా ఆయన వదిలేసిన ఒక సినిమా కారణంగా, ప్రభాస్(Rebel Star Prabhas) తన కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ ని అందుకొని, ఆ సినిమాతోనే స్టార్ హీరో గా కూడా మారిపోయాడు. ఆ సినిమా మరేదో కాదు, వర్షం(Varsham Movie). 2004 వ సంవత్సరం లో ఒక పక్క చిరంజీవి(Megastar Chiranjeevi) ‘అంజి’, మరో పక్క బాలయ్య (Nandamuri Balakrishna) ‘లక్షి నరసింహా’ సినిమాల మధ్య విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. యూత్ ఆడియన్స్ లో ఈ సినిమాతోనే ఆయనకీ ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది. అయితే ముందుగా ఈ సినిమా కథని డైరెక్టర్ శోభన్ ఉదయ్ కిరణ్ కి వినిపించాడట. దాదాపుగా ఖరారు అయిపోయింది అని అనుకుంటున్న సమయం లో ఎందుకో ఉదయ్ కిరణ్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకి వచ్చేసాడట. ఈ విషయాన్నీ డైరెక్టర్ శోభన్ అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, ఉదయ్ కిరణ్ అలా ఎన్నో మంచి సూపర్ హిట్ చిత్రాలను వదులుకున్నాడని, అవన్నీ నేడు ఆయన చేసుంటే ప్రభాస్ తో సమానమైన హీరో గా నిల్చి ఉండేవాడని విశ్లేషకులు అంటున్నారు. దురదృష్టం అంటే ఉదయ్ కిరణ్ దే పాపం అంటూ ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు బాధపడుతున్నారు.