https://oktelugu.com/

Vijay Devarakonda and Sneha Reddy : విజయ్ దేవరకొండతో అల్లు స్నేహా రెడ్డి..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయి ట్విస్ట్ ఇచ్చిన రౌడీ బాయ్!

అల్లు కుటుంబం తో యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కి మొదటి నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే 'అర్జున్ రెడ్డి' లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత, అల్లు అరవింద్ విజయ్ దేవరకొండ ని పెట్టి 'గీత గోవిందం' అనే చిత్రం చేసాడు.

Written By: , Updated On : February 19, 2025 / 09:06 AM IST
Vijay Devarakonda , Sneha Reddy

Vijay Devarakonda , Sneha Reddy

Follow us on

Vijay Devarakonda and Sneha Reddy : అల్లు కుటుంబం తో యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కి మొదటి నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే ‘అర్జున్ రెడ్డి’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత, అల్లు అరవింద్ విజయ్ దేవరకొండ ని పెట్టి ‘గీత గోవిందం’ అనే చిత్రం చేసాడు. ఈ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సినిమా వసూళ్లను ఒక్క మీడియం రేంజ్ హీరో కూడా అందుకోలేకపోయాడంటే, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ద్వారానే విజయ్ దేవరకొండ కి యూత్ ఆడియన్స్ లో, లేడీస్ లో స్టార్ హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే అప్పటి నుండి ఆయన అల్లు అరవింద్(Allu Aravind) తో, అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తో మంచి స్నేహాన్ని పెంచుకున్నాడు. అనేక సందర్భాల్లో వీళ్ళు కలవడం వంటివి కూడా మనం ఇదివరకు చూసాము.

అల్లు అర్జున్ కి విజయ్ దేవరకొండ మంచి స్నేహితుడు అనే విషయం మన అందరికీ తెలుసు కానీ, అల్లు స్నేహ రెడ్డి తో కూడా ఆయనకు మంచి స్నేహం ఉందని ఇటీవలే తెలిసింది. రీసెంట్ గా ఆయన ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా(Prayagraj Mahakumbhamela) కి తన కుటుంబం, స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఆయన కుంభమేళా లో స్నానం ఆచరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇంస్టాగ్రామ్ లో ఆయన కుంభమేళా లో తీసుకున్న కొన్ని ఫోటోలను అప్లోడ్ చేసాడు. ఆ ఫోటోలలో విజయ్ దేవరకొండ తో పాటు అల్లు స్నేహా రెడ్డి(Allu Sneha Reddy), డైరెక్టర్ వంశీ పైడిపల్లి వంటి వారు కూడా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ ఫోటోలలో కనిపించలేదు.

అల్లు అర్జున్ లేకుండా అల్లు స్నేహ రెడ్డి తన స్నేహితులతో కలిసి టూర్స్ కి కూడా వెళ్తుందా అని ఈ ఫోటోని చూసినప్పుడే అందరికీ అర్థమైంది. దీనిని బట్టీ చూస్తే విజయ్ దేవరకొండ కి కేవలం అల్లు అర్జున్ తో మాత్రమే కాదు, అల్లు స్నేహా రెడ్డి తో కూడా మంచి స్నేహం ఉంది అనే విషయం అర్థం అవుతుంది. అయితే కుంభమేళా కి వెళ్లినట్టు స్నేహా రెడ్డి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా చేయకపోవడం గమనార్షం. ఇక విజయ్ దేవరకొండ సినీ కెరీర్ విషయానికి వస్తే, వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత ఆయన గౌతమ్ తిన్ననూరి తో కలిసి చేస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాగా, దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మే 30 న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ గానే ఉన్నాయి.