Megha Star Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగుతున్న ఏకైక హీరోగా కూడా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక చిరంజీవికి ఎన్ని భారీ సక్సెస్ ఉన్నప్పటికి ఫ్యాన్ ఇండియాలో మాత్రం ఆయన సినిమాలు సక్సెస్ కాకపోవడం అనేది ఆయనకు భారీ దెబ్బగా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మొత్తానికైతే 70 సంవత్సరాల వయసులో కూడా సినిమా హీరోగా చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న చిరంజీవి ప్రస్తుతం పరిశ్రమతో మరోసారి భారీ సక్సెస్ సాధించాలని దిశగా ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రజినీకాంత్ కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ప్రస్తుతానికైతే తనదైన రీతిలో సక్సెస్ లను అందుకుంటున్న చాలా మంది దర్శకులు కూడా రజనీకాంత్ తో సినిమా చేయాలని ఆరాటపడుతున్నారు.
ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక గత సంవత్సరం ఆయన చేసిన జైలర్ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది.
పాన్ ఇండియాలో దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాతో రజినీకాంత్ మరోసారి పాన్ ఇండియాలో తన స్టార్ట్ డమ్ ను విస్తరించుకున్నాడు. ఇక ఇప్పుడు చిరంజీవి, రజనీకాంత్ స్టార్ డమ్ ను బద్దలు కొట్టాలనే ఉద్దేశ్యం తో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ అయిన సినిమా కూడా ఆయన కెరియర్ లో ఒకటి కూడా లేకపోవడం విశేషం…
దాంతో విశ్వంభర సినిమాతో ఆ రికార్డును బ్రేక్ చేయాలని తద్వారా రజనీకాంత్ రికార్డును కూడా బ్రేక్ చేసి పాన్ ఇండియాలో టాప్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక సీనియర్ హీరోలందరిలో ప్రస్తుతానికి రజనీకాంత్ కలెక్షన్స్ పరంగా మొదటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి అతని రికార్డును బ్రేక్ చేసి చిరంజీవి నెంబర్ వన్ పొజిషన్ కి రావాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది…