Nagarjuna And Venkatesh: ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడంలో విక్టరీ వెంకటేష్ సూపర్ సక్సెస్ అయ్యాడు. శోభన్ బాబు తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న హీరో కూడా తనే కావడం విశేషం…ఇక ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ని బేస్ చేసుకొని ఉంటాయి. దానివల్ల ఆయన సినిమాలను చూడడానికి వాళ్ళు ఎప్పుడు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.తద్వారా ఆయన ఎప్పటికప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తు ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే విక్టరీ వెంకటేష్ లాంటి నటుడు చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెడుతున్నావే కావడం విశేషం…ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో వచ్చి మరోసారి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని థియేటర్ కి రప్పించాడు. మరి ఈ సినిమాతో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టిన వెంకటేష్ ఈ సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదని చూస్తున్నాడు. అందుకే చాలా కథలను వింటున్నప్పటికి ఏ ఒక్క కథను కూడా ఫైనల్ అయితే చేయడం లేదు. వెంకటేష్ తో పాటు నాగార్జున కూడా అప్పట్లో మంచి గుర్తింపును సంపాదించుకొని టాప్ ఫోర్ లో ఒకరిగా నిలిచాడు.
Also Read: మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. మన రవీంద్ర జడేజా కు లార్డ్సే కాదు..మనమూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే!
నాగేశ్వరరావు నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున వరుస సినిమాలను చేస్తూ ఎక్స్పరిమెంటల్ సినిమాలను కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తూ వచ్చాడు. అయితే విక్టరీ వెంకటేష్ చేయాల్సిన ఒక సినిమా నాగార్జున చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడనే విషయం మనలో చాలా మందికి తెలియదు…
తిరుపతి స్వామి దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘ఆజాద్’ (Aazad) సినిమాని వెంకటేష్ చేయాల్సింది. ఇక తిరుపతి స్వామి మొదటి సినిమా గణేష్ తో వెంకటేష్ కి భారీ సక్సెస్ ని అందించాడు. రెండో సినిమాను కూడా అతనితోనే చేయాలనుకున్నప్పటికి వెంకటేష్ అంతకుముందు కమిట్ అయిన సినిమాలు ఉండటం వల్ల ఆజాద్ సినిమాని నాగార్జునతో చేశాడు.
మరి ఈ సినిమా చేసిన తర్వాత వెంకటేష్ తో మరొక సినిమా చేయాలని అనుకున్నప్పటికి ఆయన ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆయన హార్ట్ ఏటాక్ తో మరణించడం అనేది అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. మరి ఏది ఏమైనా కూడా వెంకటేష్ కి దక్కాల్సిన ఒక సూపర్ సక్సెస్ ని నాగార్జున తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి…ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు…