Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జునకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈయన తన కుమారులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే నాగచైతన్య సాధించినంత క్రేజ్ ను అఖిల్ సాధించలేదనే చెప్పాలి. ఈయన నటించిన చాలా సినిమాలు హిట్ లను సాధిస్తే.. అఖిల్ సినిమాలు చాలా వరకు డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకున్నాయి. అంతేకాదు ఆయన హీరోగా వచ్చిన సినిమాలు కూడా తక్కువే.
ఇక అఖిల్ తన బాల్యంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సిసింద్రీ సినిమా లో నాగార్జున కొడుకుగా అఖిలే నటించారు. నాగార్జున నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్యను కూడా హలో బ్రదర్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకున్నారట నాగార్జున. అయినా కూడా చేయలేకపోయారు. అయితే సిసింద్రీ సినిమాలో అఖిల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాగార్జున నాగచైతన్యను ఎందుకు పరిచయం చేయడం లేదు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి.
కానీ వీటికి మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకలేదు. అయితే హలో బ్రదర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకున్నా.. ఆ తర్వాత ఎందుకు వెనకడుగు వేశారో ఇప్పటికీ చెప్పలేదట నాగార్జున. దీంతో అఖిల్, నాగచైతన్యలను చూసుకునే విషయంలో ఒకరికి అన్యాయం చేశారు నాగార్జున అంటూ వార్తలు వచ్చాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రమే అలా జరిగిందని.. ఇందులో అన్యాయానికి సంబంధించిన అంశం గానీ.. కావాలని చేసిన అంశం గానీ ఏది లేదని అక్కినేని ఫ్యామిలీ గురించి తెలిసిన వారు అంటున్నారు.
ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉండడం గమనార్హం. ప్రస్తుతం అఖిల్ సినిమాలు ఒక్కటి కూడా హిట్ ను సంపాదించడం లేదు. రీసెంట్ గా వచ్చిన సినిమా కూడా అదే రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికైనా నాగార్జున, అక్కినేని అఖిల్ చేసే సినిమాలు మంచి గుర్తింపును సంపాదించుకోవాలి అని కోరుకుంటున్నారు అక్కినేని అభిమానులు.నాగార్జున హీరోగా తెరకెక్కిన నా సామిరంగా సినిమా మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకుంది. మరి ముందు ముందు ఎవరి సినిమాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.