Prabhas and Maruthi: సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. ఏ మూవీ డిలా పడిపోతుంది అనే విషయం ఎవరు చెప్పలేరు. కారణం ఏంటి అంటే సినిమా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆ సినిమా బాగా వస్తుంది అనే నమ్మకమైతే ఉంటుంది. కానీ ఫైనల్ ఔట్ పుట్ చూసిన తర్వాత అంచనాలు తరుమారై పోవచ్చు. మొత్తానికైతే ప్రభాస్ లాంటి స్టార్ హీరో మారుతి లాంటి మీడియం రేంజ్ దర్శకుడితో సినిమా చేయడమైనది సినిమా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. గత నాలుగు సంవత్సరాల క్రితమే వీళ్లిద్దరి కాంబినేషన్ కి శ్రీకారం చుట్టారు. మొత్తానికైతే నాలుగు సంవత్సరాల స్ట్రగులింగ్ పీరియడ్ తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది…ఇక ఈ సినిమాని చూసిన ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులు సైతం తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏదైనా కూడా ఈ సినిమాలో ప్రభాస్ ప్రేక్షకులు ఊహించనంత రేంజ్ లో కనిపించలేదని చెబుతారు.
సినిమా దర్శకుడు మారుతి మూవీ రిలీజ్ కి ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పాడని ఆయన చెప్పిన దాంతో సగం కూడా ఈ సినిమాలో లేదంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికైతే ప్రభాస్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో మారుతితో సినిమా చేయడమనేదే చాలా పెద్ద తప్పు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
ఇక ఇదిలా ఉంటే మారుతి హార్రర్ నేపథ్యంలో సినిమాని చేస్తున్న క్రమంలో మారుతికి ప్రభాస్ ఒక ఐడియా ఇచ్చాడట. జోకర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఈ సినిమాలో కొంచెం లెంత్ వాడితే బాగుంటుంది. దానివల్ల సినిమాకి ఇంపాక్ట్ పెరుగుతుంది. అలాగే ప్రేక్షకులు సైతం ఆ సినిమాని ఆసక్తిగా చూస్తారు. మూవీ మొత్తం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అని చెప్పారట.
కానీ మారుతి మాత్రం దాన్ని పట్టించుకోకుండా అది సెకండ్ పార్ట్ లో వస్తుంది అంటూ ప్రభాస్ ను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. ఫైనల్ గా సినిమా ఓవరాల్ గా డల్ అయిందని ప్రభాస్ పర్ఫామెన్స్ ని మినహాయిస్తే సినిమాలో ఏమీ లేదని తేల్చి చెప్పేస్తున్నారు. దీంతో ప్రభాస్ చెప్పినట్టుగా చేసిన కూడా సినిమా సక్సెస్ తీరాలకు చేరి ఉండేదని ప్రభాస్ అభిమానులు సైతం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు…