OG Karnataka: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే ఇంతకుముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే ఉద్దేశ్యంతో ముందుకు దూసుకెళ్తుండటం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఓజీ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల ముందు నిలబడలేక పోతున్నాయి. ఆయన క్రేజ్ ను తట్టుకొని నిలబడగలిగే కెపాసిటి ఇప్పుడున్న హీరోలెవ్వరికి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు.పవన్ కళ్యాణ్ కి గత కొన్ని రోజుల నుంచి సరైన సక్సెస్ అయితే పడడం లేదు. కానీ ఒక్క సక్సెస్ పడితే మాత్రం హీరోలందరిని బీట్ చేస్తూ నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంటాడని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…
మరి ఇలాంటి సందర్భంలోనే ఓజీ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక అన్ని భాషల్లో ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో అయితే ఈ సినిమా కోసం జనాలు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. కర్ణాటక లో ఈ సినిమా టిక్కెట్లు బుకింగ్ పెట్టిన ఎనిమిది నిమిషాల్లోపే బుకింగ్స్ మొత్తం అయిపోయాయి అంటే ఈ సినిమా హైపు ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…
అక్కడ కేజిఎఫ్ సినిమా టిక్కెట్స్ బుకింగ్ సైతం 10 నిమిషాల్లో పూర్తి అయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మాత్రం ఎనిమిది నిమిషాల్లోనే పూర్తిగా బుకింగ్స్ అయిపోవడం అనేది ఒక రికార్డును క్రియేట్ చేసిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ మానియా కర్ణాటకలో కూడా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక గత సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమా టికెట్లు సైతం పది నిమిషాల్లోనే బుకింగ్స్ పూర్తయ్యాయి. ఇక ఆ సినిమా రికార్డును కూడా పవన్ కళ్యాణ్ బ్రేక్ చేశాడనే చెప్పాలి… సినిమా రిలీజ్ కి ముందు అన్ని రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో తెలియాలంటే కొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సిందే…