https://oktelugu.com/

Venkatesh: వెంకటేష్ చేయాల్సిన ఆ సూపర్ హిట్ సినిమాను కమల్ హాసన్ చేశాడా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా గుర్తింపు పొందిన శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ......... సినిమాని మొదట వెంకటేష్ తో చేయాలని అనుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 15, 2024 / 02:33 PM IST
    Follow us on

    Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో వెంకటేష్. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు అందుకోవడమే కాకుండా ఆయన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర చేశాయనే చెప్పాలి. ముఖ్యంగా వెంకటేష్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

    అందుకే ఆయన సినిమాలు ఎక్కువగా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతూ ఉంటాయి. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా గుర్తింపు పొందిన శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు సినిమాని మొదట వెంకటేష్ తో చేయాలని అనుకున్నాడు. కానీ అప్పటికే వెంకటేష్ కొన్ని సినిమాలు కమిట్ అయి ఉండడం వల్ల అతను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు దాంతో సినిమాని కమలహాసన్ తో చేశాడు. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా కమలహాసన్ కెరియర్ లో కూడా ఇది ఒక బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.

    ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక మొత్తానికైతే విక్టరీ వెంకటేష్ తన ఖాతాలో ఒక భారీ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కామెడీ ప్రధానంగా సాగనున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో గనుక సూపర్ సక్సెస్ ని అందుకుంటే వెంకటేష్ కెరియర్ మరింత సూపర్ ఫాస్ట్ గా ముందుకు దూసుకెళ్తుంది అనే చెప్పాలి.

    ఇక శంకర్ కూడా ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఈ సంవత్సరంలోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు… ఇక మొత్తానికైతే శంకర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టి మరోసారి తన స్టామినా ఏంటో పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.