https://oktelugu.com/

Acer TVs : ఏసర్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ ది బెస్ట్.. ధర కూడా తక్కువే..

భారత మార్కెట్లోకి అత్యంత స్పీడ్, క్లారిటీ, సౌండ్ ఉన్న టీవీ రాబోతోంది. ఏసర్ కు చెందిన ఈ ఆండ్రాయిడ్ టీవీ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పని చేస్తోంది. గేమింగ్ ప్రియుల కోసం దీన్ని తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 10, 2024 / 02:30 PM IST

    Acer TVs

    Follow us on

    Acer TVs : పూర్తిగా ఆండ్రాయిడ్ 14 ఆధారితంగా పని చేసే ఏసర్ టీవీలు ఇండియన్ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది. సరికొత్త టెక్నాలజీతో ఇండియాలో లాంచ్ అవుతున్న మొదటి టీవీ ఇదే అవడం విశేషం. ఈ టీవీకి ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక విశేషాలు ఉన్నాయి. గేమింగ్ కోసం స్పెషల్ గా దీన్ని రూపొందించారు. ఇవి గేమింగ్ ప్రియుల కోసం డిజైన్ చేసినట్లు కంపెనీ చెప్తోంది. ఇందులో వారి కోసం ర్యామ్, స్టోరేజీ, తదితరలను పెంచినట్లు కంపెనీ చెప్తోంది. ఇండియా మార్కెట్ లో ఈ టీవీలకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ స్టార్టప్ ఇండ్కాల్ ఏసర్ బ్రాండింగ్ తో కొత్త టీవీ సిరీస్ ను లాంచ్ చేసింది. వివిధ సిరీస్ లతో స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. భారత మార్కెట్ లో ఏసర్ పేరుతో పలు ఉత్పత్తులను విక్రయిస్తున్న ఈ సంస్థ త్వరలోనే తన స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేయనుంది. తాజా స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ 14 ఆధారితంగా పనిచేస్తాయి. విభిన్న బడ్జెట్ లతో వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని సూపర్ సిరీస్ తో పాటు M-సిరీస్, L-సిరీస్ లను విడుదల చేసింది. ఈ టీవీ సిరీస్ ధర, ఇతర వివరాలు తెలుసుకుందాం.

    ధర ఎంతంటే?
    సూపర్ సిరీస్ స్మార్ట్ టీవీ ధర రూ. 32,999 నుంచి ప్రారంభం అవుతోంది. అదే సమయంలో, M-సిరీస్ స్మార్ట్ టీవీల ప్రారంభ ధర రూ. 89,999, L-సిరీస్ ప్రారంభ ధర రూ. 14,999. అమ్మకాల తేదీల గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

    స్పెసిఫికేషన్స్..
    ఆండ్రాయిడ్ 14 ఆధారిత గూగుల్ టీవీ ఓఎస్ తో భారత మార్కెట్ లో లాంచ్ అయిన తొలి స్మార్ట్ టీవీలు ఏసర్ కు చెందిన తాజా మోడళ్లు. సూపర్ సిరీస్ లో డాల్బీ విజన్, ఎంఈఎంసీ, సూపర్ బ్రైట్ నెస్, హెచ్‌డీఆర్ 10+ తదితర ఫీచర్లతో కూడిన అల్ట్రా క్యూఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు.

    ఈ టీవీలో ఆల్మ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. గేమింగ్ ప్రియుల కోసం సూపర్ సిరీస్ టీవీలు మంచి ఆప్షన్. అలాగే, సూపర్ సిరీస్ స్మార్ట్ టీవీలు 80 వాట్ ప్రో ట్యూన్డ్ స్పీకర్ ను కలిగి ఉన్నాయి. ఇది వినియోగదారులకు ఉత్తమ ఆడియో అవుట్ పుట్ ను కలిగి ఉంటుంది.

    M-సిరీస్ కింద కంపెనీ బిగ్ స్క్రీన్ టీవీని లాంచ్ చేసింది. 65 అంగుళాలు, 75 అంగుళాల స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ టీవీ మినీ ఎల్ఈడీ, క్యూఎల్ఈడీ డిస్ ప్లే వస్తుంది. ఈ మోడళ్లలో 1400 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 60 వాట్ ఆడియో అవుట్ పుట్ ఉన్నాయి.

    L-సిరీస్ లో కంపెనీ 4-సైడ్ ఫ్రేమ్లెస్ డిజైన్ ను ఇచ్చింది. ఈ టీవీ 32 అంగుళాల స్క్రీన్ సైజులో హెచ్ డీ డిస్ ప్లేతో వస్తుంది. ఈ సిరీస్ లో భాగంగా కంపెనీ 65 అంగుళాల వరకు మోడళ్లను లాంచ్ చేసింది. L-సిరీస్, M-సిరీస్లలో ఆండ్రాయిడ్ 14 ఆధారిత గూగుల్ టీవీ ఓఎస్ లభిస్తుంది. ఇది ఏఐ ఎనేబుల్డ్ డ్యూయల్ ప్రాసెసర్ ఇంజిన్ ను పొందుతుంది.