Dil Raju and Nithiin: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నితిన్ (Nithiin) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. జయం (Jayam) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా మూడు విజయాలను అందుకున్న ఆయన ఆ తర్వాత నుంచి వరుస డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. ఇక ఎప్పుడైతే ఇష్క్(Ishq) సినిమా వచ్చిందో అప్పటినుంచి అతనికి మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించిన తర్వాత గుండెజారి గల్లంతయిందే, హార్ట్ ఎటాక్, అఆ లాంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. ఇక గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఆరు ప్లాప్ లను అందుకున్నాడు. మరి ఈ క్రమంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే చాలా మంచి సక్సెసులైతే దక్కుతాయని చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నితిన్ మంచి సక్సెస్ లను సాధిస్తున్న సమయంలో సతీష్ వేగేశ్న (Sathish Vegesna)’శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమా చేసి భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు. నితిన్ ఆ సినిమాను చేయడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదట…
Also Read: చిరంజీవి గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వాలంటే ఎలాంటి కండిషన్స్ పెడుతాడో తెలుసా..?
కానీ దిల్ రాజు మాత్రం నితిన్ కి బాగా సెట్ అవుతుందని అతనికి చెప్పి అతన్నీ ఒప్పించి ఆయన చేత ఈ సినిమాని చేయించాడు. ఫైనల్ గా సినిమా ఫ్లాప్ అయింది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు తమ్ముడు (Tammudu) సినిమాని నానితో చేయాల్సింది. కానీ నాని చేయనని చెప్పడంతో మరోసారి దిల్ రాజు నితిన్ దగ్గరికి వచ్చి అతన్ని ఒప్పించి ఆ సినిమా చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను సంపాదించుకుంది.
మరి ఏది ఏమైనా కూడా నితిన్ వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో దిల్ రాజు కావాలనే అతన్ని ప్లాప్ కథలకు లాక్ చేసి అతని సినిమాలను ఫ్లాప్ చేయిస్తున్నాడు అంటూ నితిన్ అభిమానులు కొంతవరకు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు వేణు యేల్దండి (Venu Yeldhandi) దర్శకత్వంలో చేయబోతున్న బలగం సినిమా విషయంలో నితిన్ ఎలాంటి రూట్ ను ఎంచుకుంటున్నాడు.
Also Read: నాని తో పోటీ పడలేక చేతులెత్తేసిన హీరోలు..?నాని కి వాళ్లకు ఉన్న తేడా అదేనా..?
ఆయనకు ఆ సినిమా చేసే ఇంట్రెస్ట్ ఉందా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు…