https://oktelugu.com/

Pushpa 2 Movie Sooseki Song: పుష్ప 2 లోని ‘సుసేకే నా సామి’ సాంగ్ ను దేవి ఆ సాంగ్ నుంచి కాపీ చేశాడా..?

Pushpa 2 Movie Sooseki Song: ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ గా వచ్చిన పుష్ప అనే టైటిల్ సాంగ్ సూపర్ సక్సెస్ అవ్వగా ఇప్పుడు సెకండ్ సింగిల్ గా "సూసేకే నా స్వామి" అనే ఒక మెలోడీ సాంగ్ అయితే రిలీజ్ అయింది.

Written By:
  • Gopi
  • , Updated On : May 29, 2024 / 01:50 PM IST

    Devisri Prasad copy the Sooseki song from Pushpa 2 from that song

    Follow us on

    Pushpa 2 Movie Sooseki Song: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)…ఒకప్పుడు స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఆయన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతారం ఎత్తాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాలో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు.

    ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ గా వచ్చిన పుష్ప అనే టైటిల్ సాంగ్ సూపర్ సక్సెస్ అవ్వగా ఇప్పుడు సెకండ్ సింగిల్ గా “సూసేకే నా స్వామి” అనే ఒక మెలోడీ సాంగ్ అయితే రిలీజ్ అయింది. అయితే ఇంతకుముందు ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలైతే ఉన్నాయో ఇప్పుడు దానికి మించిన అంచనాలైతే పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఈ సాంగ్ దేవిశ్రీప్రసాద్(Devisri Prasad) ఇంతకుముందు మ్యూజిక్ ఇచ్చిన తులసి సినిమాలోని “వెన్నెలింత వేడిగా” అనే సాంగ్ లో ఒక ట్రాక్ ని తీసుకొని ఈ సాంగ్ కొట్టినట్టుగా మనకు ఆ సాంగ్ వింటుంటే అర్థమవుతుంది.

    Also Read: Pushpa 2 Sooseki Song: పుష్ప 2 సెకండ్ సింగిల్ ‘సూసేకి’ రివ్యూ : పార్ట్ 1 సామి సామి ఫ్లేవర్ మిస్!

    ఇక ఇలాంటి క్రమం లోనే దేవిశ్రీప్రసాద్ ఇంతకు ముందు ఇచ్చిన సాంగ్ కూడా కాపీ అంటూ చాలా విమర్శలనైతే ఎదుర్కుటుంది. ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఈ సాంగ్ ను కూడా కాపీ చేస్తూ ట్యూన్స్ కొట్టాడు అంటూ విమర్శలైతే వస్తున్నాయి. అయితే దేవిశ్రీప్రసాద్ వేరే వాళ్ళ సాంగ్స్ కాపీ చేయకుండా తన సాంగ్స్ ను తనే కాపీ చేస్తూ ట్యూన్స్ కొడుతున్నాడు…

    Also Read: Fahad Fazil : పుష్ప విలన్ కి ఆ వ్యాధి సోకిందా… స్వయంగా చెప్పి షాక్ ఇచ్చిన ఫహాద్ ఫాజిల్

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సుకుమార్ అల్లు అర్జున్ భారీ సక్సెస్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వీరిద్దరూ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కనక కొట్టినట్టైతే అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది…చూడాలి మరి ఈ సినిమా పాన్ ఇండియా లో ఎలాంటి మ్యాజిక్ ను రిపీట్ చేస్తుంది అనేది…