WhatsApp Status: మీ వాట్సాప్ స్టేటస్ బార్ చెక్ చేశారా.. కొత్త మార్పును గమనించారా?

బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల స్టేటస్ ఫీచర్ సామర్ధ్యాన్ని పెంచేందుకు వాట్సప్ కసరత్తు చేసింది. దీనివల్ల వాయిస్ నోట్ నిడివి నిమిషానికి పెరిగింది. ఈ కొత్త వెర్షన్ ను అప్డేట్ చేసి.. యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 29, 2024 1:54 pm

WhatsApp Status

Follow us on

WhatsApp Status: వాట్సప్ కొత్త కొత్త అప్డేట్ లతో యూజర్ల మతి పోగోడుతోంది.. మూడు బిలియన్ల యూజర్లతో అలరారుతున్న ఈ మెసేజింగ్ యాప్.. రోజుకో కొత్త ఫీచర్ జత చేస్తూ అదరగొడుతోంది.. ఇప్పటికే సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన వాట్సాప్ ఇప్పుడు కొత్తగా మరో ఫీచర్ ను తీసుకొచ్చింది.

బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల స్టేటస్ ఫీచర్ సామర్ధ్యాన్ని పెంచేందుకు వాట్సప్ కసరత్తు చేసింది. దీనివల్ల వాయిస్ నోట్ నిడివి నిమిషానికి పెరిగింది. ఈ కొత్త వెర్షన్ ను అప్డేట్ చేసి.. యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.. దీని ప్రకారం యూజర్లు ఇప్పుడు తమ స్టేటస్ అప్డేట్ల ద్వారా ఎక్కువ నిడివి ఉన్న ఆడియో మెసేజ్ రికార్డు చేయొచ్చు, అదే సమయంలో షేర్ చేసుకోవచ్చు. గతంలో వాట్సప్ స్టేటస్ లో నిడివి ఎక్కువ ఉన్న వీడియోలను పోస్ట్ చేయడం సాధ్యమయ్యేది కాదు. దీనివల్ల యూజర్లు చాలా ఇబ్బంది పడేవారు. దీనిని మార్చాలని వాట్సప్ యాజమాన్యాన్ని సోషల్ మీడియా వేదికగా కోరేవారు. వారి విజ్ఞప్తిని మన్నించిన వాట్సప్ యాజమాన్యం.. షేరింగ్ విధానంలో సరికొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీని ప్రకారం స్టేటస్ అప్డేట్ లకు సంబంధించి ఈవెంట్లు, ప్రకటనలు, వీడియోలను యూజర్లు షేర్ చేసుకోవచ్చు. వాయిస్ నోట్ ఎలా అయితే పంపుతున్నారో.. అదేవిధంగా మైక్ బటన్ నొక్కి పట్టుకోవడం ద్వారా వాయిస్ నోట్ రికార్డ్ చేయవచ్చు. దీన్ని తమ స్టేటస్ బార్ గా అప్డేట్ చేసుకోవచ్చు.. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని కొంతమంది యూజర్లకు మాత్రమే వాట్సప్ అందుబాటులో తెచ్చింది.. మిగతా వారికి త్వరలోనే ఈ సౌలభ్యం లభిస్తుందని వాట్సప్ ప్రకటించింది.. ఈ సౌలభ్యం త్వరగా అందుకోవాలంటే వాట్సాప్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని యాజమాన్యం సూచిస్తోంది.

కేవలం వాయిస్ నోట్ మాత్రమే కాకుండా.. ఇంకా కొన్ని ఫీచర్లు అందించేందుకు వాట్సప్ పరిశోధనలు చేస్తోంది. ” మీ వాట్సాప్ స్టేటస్, అప్డేట్లను ఎవరు చూడవచ్చని విషయాన్ని కూడా నిర్ధారించవచ్చు” అనే విషయంపై పరిశోధన సాగిస్తోంది. దీనిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే యూజర్లకున్తమ అప్డేట్స్ ఎవరు చూడవచ్చని దానిపై మరింత స్పష్టత వస్తుంది. అలాగే స్టేటస్ అప్డేట్ల విషయంలో లెంగ్తి వీడియోలను కూడా షేర్ చేయవచ్చు. నిమిషం నిడివి ఉన్న వీడియోలను కూడా పంపించుకోవచ్చు. గతంలో 30 సెకండ్ల వీడియోలు మాత్రమే అప్డేట్ అయ్యేందుకు ఆస్కారం ఉండేది.