spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Nagarjuna cheat Revanth : నెగెటివిటీని తప్పించుకోవడం కోసం అబద్దం చెప్పిన నాగార్జున.....

Bigg Boss Nagarjuna cheat Revanth : నెగెటివిటీని తప్పించుకోవడం కోసం అబద్దం చెప్పిన నాగార్జున.. మండిపడుతున్న నెటిజెన్స్

Did Big Boss Nagarjuna cheat Revanth? : బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ గా రేవంత్ నిలిచినప్పటికీ.. శ్రీహాన్ మరియు రేవంత్ ఇద్దరూ కూడా టైటిల్ విన్నర్స్ అని అక్కినేని నాగార్జున ప్రకటించడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.. బిగ్ బాస్ చరిత్రలో ఒక సీజన్ లో ఇలా ఇద్దరు కంటెస్టెంట్స్ గెలవడం అనేది ఎప్పుడూ జరగలేదు..ప్రారంభం నుండే ఈ సీజన్ ప్రేక్షకుల అంచనాలకు పూర్తి భిన్నంగా సాగుతూ వచ్చింది.. టాస్కుల దగ్గర నుండి ఎలిమినేషన్స్ వరకు అన్నీ ఊహించని విధంగానే జరుగుతూ వచ్చాయి.

ఒకానొక్క సందర్భంలో ప్రేక్షకులకు ఈ షో మీద విరక్తి కలిగేలా చేసారు బిగ్ బాస్ టీం.. ట్విస్టులనే నమ్ముకున్న ఈ సీజన్ డిజాస్టర్ కాకుండా పర్వాలేదని అనిపించుకుంది.. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా ఈ సీజన్ మొత్తం కలిపి యావరేజి రేంజ్ అని చెప్పొచ్చు..ఇది ఇలా ఉండగా ఈ సీజన్ ప్రారంభం నుండి చివరి వరకు కంటెస్టెంట్స్ అందరికంటే ఎక్కువ ఓట్లు రప్పించుకుంటూ తనకి పోటీ ఎవ్వరు లేరు అనే విధంగానే రేవంత్ జర్నీ సాగింది.

సోషల్ మీడియా లో జరిగే వెబ్సైట్ పోలింగ్స్ ప్రకారం కూడా రేవంత్ టైటిల్ విన్నర్ అని, అతనికే ఎక్కువ ఓట్లు వచ్చాయని అందరూ అనుకున్నారు..కానీ చివర్లో నాగార్జున మాత్రం ‘ఎవరికీ ఎక్కువ ఓట్లు వచ్చాయో చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను..స్వల్ప ఓట్ల తేడా తో శ్రీహాన్ కి రేవంత్ మీద ఎక్కువ ఓట్లు వచ్చాయి’ అని అంటాడు..వాస్తవానికి నాగార్జున అలా చివరి నిమిషం మార్చి చెప్పాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం..వాస్తవానికి రేవంత్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయి..కానీ నాగార్జున హౌస్ లోపలకు సూట్ కేసుతో అడుగుపెట్టి శ్రీహాన్ మరియు రేవంత్ ఇద్దరికీ 40 లక్షల ఆఫర్ ఇవ్వడం తో రేవంత్ ట్రోఫీ గెలవడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపగా, శ్రీహాన్ మాత్రం 40 లక్షలు తీసుకొని బయటకి వస్తాడు..ఇది నిజంగా ఎవ్వరు ఊహించలేదు.

అలాంటి ఊహించని పరిణామం జరిగింది కాబట్టే, ఓట్ల ద్వారా గెలుపొందిన కంటెస్టెంట్ కంటే రన్నర్ కి ఎక్కువ క్యాష్ ప్రైజ్ వచ్చిందని తెలిస్తే అందరూ బిగ్ బాస్ పై తీవ్రమైన నెగెటివిటీ చూపిస్తారని.. దాని ప్రభావం తదుపరి సీజన్ మీద కూడా పడే అవకాశం ఉన్నందున, ఇలా నాగార్జున చివరి నిమిషంలో అబద్దం చెప్పాడని ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తున్న టాక్.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper
Exit mobile version