Bigg Boss 9 fame Sanjana: ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) ని టాప్ రేటింగ్స్ తో దూసుకుపోయేలా చేసిన కంటెస్టెంట్స్ లో ఒకరు సంజన గల్రాని(Sanjana galrani). ఆ సీజన్ ని పైకి లేపిన మొట్టమొదటి కంటెస్టెంట్ ఈమెనే. ఇలా చేస్తే జనాలు తన గురించి ఏమని అనుకుంటారో అనే భయం లేకుండా, మొదటి రోజు నుండి చివరి రోజు వరకు హౌస్ లో కొనసాగింది. అందుకే అంత మంది తోపు కంటెస్టెంట్స్ తో పోటీ పడి టాప్ 5 లో ఒకరిగా నిల్చింది. రెండు నెలల పసిబిడ్డకు జన్మనిచ్చి , ఆ బిడ్డని వదిలేసి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకి రావడం అనేది సాధారణమై విషయం కాదు. అలా వచ్చి, హౌస్ లో అతి కష్టమైన పరిణామాలను ఎదురుకొని, చివరి వరకు ఆమె నిలబడడం అనేది నిజంగా ఎంతో ఆదర్శవంతమైన ప్రయాణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదంతా పక్కన పెడితే సంజన కి ఆరోజుల్లో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తో ప్రేమాయణం నడిచింది అనే వార్త పెద్ద సంచలనం రేపింది. సంజన కర్ణాటక ప్రాంతానికి చెందిన అమ్మాయి. మన టాలీవుడ్ ఆడియన్స్ కి ఈమె ‘బుజ్జిగాడు’ చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది కానీ , ఇక్కడ పెద్దగా ఫేమ్ రాలేదు. కానీ కన్నడ సినీ పరిశ్రమలో ఈమె ఒకప్పుడు మంచి టాప్ హీరోయిన్. 2011 వ సంవత్సరం లో IPL మ్యాచులు కొన్ని బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియం లో జరిగేవి. తానూ కర్ణాటక ప్రాంతానికి చెందిన అమ్మాయి కాబట్టి, ఈమె RCB టీం కి సపోర్టుగా నిల్చింది. ఆ టీం మ్యాచులు జరిగిన ప్రతీ సారి ఆమె స్టేడియం కి వచ్చి సందడి చేసేది. అలా ఒక రోజు ఈమె గ్రౌండ్ లో ఆ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ తో క్లోజ్ గా మాట్లాడుతూ కనిపించింది.
ఇక అప్పటి నుండి అందరూ విరాట్ కోహ్లీ, సంజన లవ్ లో ఉన్నారంటూ రూమర్స్ పుట్టించారు. దీనిపై రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సంజన క్లారిటీ ఇస్తూ ‘నేను బెంగళూరు అమ్మాయిని. RCB మ్యాచ్ ఇక్కడ జరిగినప్పుడు నేను అతిథిగా వెళ్లాను. నాకు విరాట్ కోహ్లీ తో మొదటి నుండి మంచి స్నేహం ఉండేది. కానీ దానివల్ల సోషల్ మీడియా లో మేము రిలేషన్ లో ఉన్నామంటూ రూమర్స్ వచ్చాయి. అప్పటి నుండి మేమిద్దరం దూరం అయిపోయాము. ఈ రూమర్స్ రాకపోయుంటే మేము ఇప్పటికీ మంచి స్నేహితులు గా కొనసాగుతూ ఉండేవాళ్ళం. మంచి స్నేహం మిస్ అయ్యినందుకు నాకు ఇప్పటికీ బాధగానే ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది సంజన. ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
