Director Gunasekhar And Mahesh Babu: సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల సినిమాకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాలో ఏదొక వైవిద్యమైన కథాంశం ఉండే విధంగా చూసుకుంటున్నారు. అందుకే వాళ్ల నుంచి వచ్చే సినిమాలు సగటు ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అలాంటి మహేష్ బాబు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు అతనికి పెద్దగా సక్సెస్ లను తీసుకొచ్చి పెట్టలేదు. దాంతో రాజమౌళి డైరెక్షన్లో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమాకి కష్టపడినంత రేంజ్ లో ఈ సినిమాలో విపరీతంగా కష్టపడుతూ తన అభిమానులను ఎలాగైనా సరే సాటిఫై చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తే ఈ సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందో మనకు క్లారిటీ అయితే వచ్చింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఐదు పాత్రల్లో నటిస్తుండటం విశేషం… గతంలో మహేష్ బాబుతో సినిమాలను చేసిన దర్శకులందరు మహేష్ బాబుతో సినిమా చేయడం అంత ఈజీ కాదు.
ఆయన రేంజ్ కథ దొరికినప్పుడు మాత్రమే ఆయనతో సినిమాలు చేయాలి అంటూ కామెంట్లైతే చేశారు. మహేష్ బాబుతో యువరాజు అనే సినిమా చేసిన వైవిఎస్ చౌదరి అలాగే మహేష్ బాబుకి ఒక్కడు లాంటి సూపర్ సక్సెస్ ని అందించిన గుణశేఖర్ సైతం అలాంటి కామెంట్లు చేయడం విశేషం…గుణశేఖర్ తో మహేష్ బాబు మూడు సినిమాలను చేశాడు.
ఆ మూడు సినిమాలు కూడా మహేష్ బాబుకి చాలా మంచి ఇమేజ్ తీసుకొచ్చి పెట్టాయి… ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్టుగా కథలు ఉన్నప్పుడే ఆయనతో సినిమాలు చేయాలి. అలా కాకుండా ఇష్టం వచ్చిన కథలతో సినిమాలు చేస్తే మాత్రం ఆ సినిమాలు డిజాస్టర్ అవుతాయనిడానికి చాలా సినిమాలను మనం ఉదాహరణకు తీసుకోవచ్చు…
