Balakrishna daughter Brahmani: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా ఎక్కువైపోయింది. స్టార్ హీరోల దగ్గర నుంచి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల తాలూకా వాళ్లు కూడా హీరోలుగా మరి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళ సత్తా ఏంటో చూపించారు. బాలకృష్ణ కూతురు అయిన బ్రాహ్మణి సైతం కెరియర్ స్టార్టింగ్ లో సినిమా ఇండస్ట్రీకి రావాలని అనుకున్నారట. ఒక సినిమాని కూడా స్టార్ట్ చేసినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి… బ్రాహ్మణి హీరోయిన్ గా వస్తున్న సినిమాలో హీరో ఎవరు అంటూ అప్పట్లో పలు కామెంట్స్ వ్యక్తమయ్యాయి. మొత్తానికైతే బ్రాహ్మణి హీరోయిన్ స్టార్ట్ అయిన సినిమాలో నారా లోకేష్ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని ప్రణాళికలు చేశారు.
కెరియర్ మొదట్లో నారా లోకేష్ కి యాక్టింగ్ సంబంధించిన మెలకువలను నేర్పించి తనను హీరోగా సెట్ చేద్దామని చంద్రబాబు నాయుడు అనుకన్నాడు. అలాగే ఒక సినిమాని కూడా స్టార్ట్ చేశారు. ఇకానీ అది ఆగిపోయింది. ఈ సినిమా కనక వర్కౌటైతే మాత్రం అటు లోకేష్, ఇటు బ్రాహ్మణి ఇద్దరు ఒకేసారి సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యేవారు. ఇక నిజజీవితంలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ప్రస్తుతం హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు…
ఇక ప్రస్తుతం బాలయ్య బాబు తన కొడుకు అయిన మోక్షజ్ఞని ఇండస్ట్రీకి తీసుకురావడానికి తీవ్రమైన సన్నాహాలు చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తోంది.
ఇక మరికొందరు మాత్రం ఈ సినిమా ఎప్పుడో క్యాన్సల్ అయిందని వేరే దర్శకుడితో బాలయ్య తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయించే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… చూడాలి మరి బాలయ్య ఫ్యామిలీ నుంచి రాబోయే హీరో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఇప్పుడున్న పోటీ ప్రపంచం లో ఇప్పుడున్న హీరోలకు దీటుగా సినిమాలను చేసి ప్రేక్షకులను మెప్పించగలుగుతాడా? లేదా అనేది…