Anushka Ghaati Movie: చాలా కాలం తర్వాత అనుష్క(Anushka Shetty) ‘ఘాటీ'(Ghaati Movie) చిత్రం ద్వారా రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత అనుష్క చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. అది కూడా కేవలం ప్రభాస్(Rebel Star Prabhas) అన్నయ్య కి సంబంధించిన UV క్రియేషన్స్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత అనుష్క నుండి ‘భాగమతి’ అనే చిత్రం వచ్చింది. కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద సక్సెస్. ఆ తర్వాత భారీ గ్యాప్ తీసుకుంది. కోవిద్ సమయం లో ఈమె నటించిన ‘నిశ్శబ్దం’ అనే చిత్రం నేరుగా ఓటీటీ లో విడుదలైంది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆమె భారీ గ్యాప్ తీసుకొని ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా చేసింది. ఈ సినిమా విడుదలైన రెండేళ్లకు ఇప్పుడు ‘ఘాటీ’ తో మన ముందుకు రాబోతుంది.
డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఈ చిత్రం పై భారీ హైప్ ని పెంచింది. కాసేపటి క్రితమే రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఘాటీ’ మూవీ కి సంబంధించిన రిలీజ్ గ్లింప్స్ వీడియో ని విడుదల చేసాడు. ఈ గ్లింప్స్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అనుష్క శెట్టి ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని కోణం లో, అత్యంత వీరోచితంగా డైరెక్టర్ క్రిష్ ఇందులో చూపించినట్టుగా అనిపించింది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందు ప్రభాస్ అనుమతి తోనే వెళ్లిందట. UV క్రియేషన్స్ బ్యానర్ అంటే పరోక్షంగా ప్రభాస్ సొంత బ్యానర్ అనే చెప్పాలి. ఆయన అన్నయ్య ప్రబోధ్, మరియు ప్రభాస్ స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన బ్యానర్ ఇది. ఈ బ్యానర్ లో ఏ సినిమా అయినా ముందుకు వెళ్లాలంటే ప్రభాస్ ని కూడా ఒక మాట అడిగి నిర్ణయం తీసుకుంటారట.
ఘాటీ చిత్ర స్టోరీ తో డైరెక్టర్ క్రిష్ యూవీ క్రియేషన్స్ దగ్గరకి వెళ్లడం, ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ ని ప్రభాస్ కి కూడా వినిపించడం, ఇందులో అనుష్క హీరోయిన్ గా నటించబోతుంది అనగానే ప్రభాస్ ఎంతో సంతోషానికి గురై వెంటనే ఓకే చెప్పడం, అలా ‘ఘాటీ’ మొదలై రేపు మన ముందుకు రాబోతుండడం వంటివి జరిగబోతున్నాయి. మరి ఆడియన్స్ ని ఈ చిత్రం అలరిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. డైరెక్టర్ క్రిష్ మొట్టమొదటిసారి తన కంఫర్ట్ జోన్ ని పూర్తిగా వదిలి ఒక యాక్షన్ జానర్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేసాడు. సినిమా ఔట్పుట్ పట్ల ఆయన ఎంతో సంతృప్తి తో ఉన్నాడు. మరి ఈ చిత్రం తో ఆయన సక్సెస్ ని అందుకుంటాడో లేదో చూడాలి. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అన్ని ప్రాంతాల్లోనూ ఆశించిన స్థాయిలో జరగలేదు. ఓపెనింగ్స్ రావాలంటే కచ్చితంగా టాక్ రావాలి, లేదంటే టాలీవుడ్ కి మరో భారీ డిజాస్టర్ దొరికినట్టే.