Anupama Parameswaran Tillu Square: గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘టిల్లు స్క్వేర్'(Tillu Square). ‘డీజే టిల్లు’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓటీటీ లో కూడా ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఎగబడి చూశారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) నటించిన సంగతి తెలిసిందే. ఆమె ఈ సినిమాలో విలన్ కూడా. అంత అందమైన అనుపమ ని విలన్ క్యారక్టర్ లో చూసి అప్పట్లో అందరూ షాక్ కి గురయ్యారు. అంతే కాదు ఎంతో పద్దతి గా తెలుగు అమ్మాయి లాగా కనిపించే అనుపమ, ఇందులో పొట్టి దుస్తులు ధరించడమే కాకుండా, హీరో సిద్దు తో చేసిన భీభత్సమైన రొమాన్స్ సంచలనం గా మారింది.
Also Read: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా!
అయితే ఈ సినిమా లో నటించినప్పుడు కలిగిన అనుభూతిని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది అనుపమ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా'(Paradha Movie) అనే చిత్రం ఈ నెల 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె చేస్తున్న ప్రొమోషన్స్ లో భాగంగా ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె మాట్లాడుతూ ‘ గత ఏడాది నేను చేసిన టిల్లు స్క్వేర్ చిత్రం కమర్షియల్ గా చాలా పెద్ద హిట్ అయ్యింది. కానీ నా అభిమానులు మాత్రం నేను అలాంటి నెగిటివ్ క్యారక్టర్ చేసినందుకు చాలా ఫీల్ అయ్యారు. వాళ్ళు అలా ఫీల్ అవ్వడం లో తప్పు కూడా లేదు. ఎందుకంటే నేను ఆ క్యారక్టర్ ని ఒప్పుకోవడానికి చాలా టైం పట్టింది. ఒకానొక సమయంలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైంది. సెట్స్ కి వెళ్లిన తర్వాత కూడా నేను 100 శాతం కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా చేయలేదు’.
‘సినిమాలో కానీ, ఆ సినిమా ప్రొమోషన్స్ లో కానీ ఆ డ్రస్సులు వేసుకోవడం నాకు అసలు కంఫర్ట్ గా అనిపించలేదు. ఇలాంటి క్యారక్టర్ చేస్తే జనాలు ఏమనుకుంటారో అనే భయం కూడా నాలో ఉండేది. కానీ ఆ పాత్ర చాలా బలమైనది. హీరో కంటే పవర్ ఫుల్ క్యారక్టర్. అందుకే ఒప్పుకొని చేసాను. నా అభిమానులు ఎక్కువ శాతం మంది ఫీల్ అయినప్పటికీ కూడా, ఆ క్యారక్టర్ ఎంత బలమైనది అని నేను నమ్మానో, ఆడియన్స్ నుండి కూడా అదే మాట వినిపించింది. ఈ క్యారక్టర్ చేసిన తర్వాత కచ్చితంగా విమర్శలు వస్తాయని నేను ఊహించాను. అనుకున్నట్టే జరిగింది. కానీ ఆ క్యారక్టర్ నాకు మంచి కిక్ ని ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది అనుపమ. వాస్తవానికి ఈ క్యారక్టర్ కోసం అప్పట్లో శ్రీలీల ని సంప్రదించారు. కానీ ఆమె ఒప్పుకోలేదు, చివరికి అనుపమ ఫైనల్ అయ్యింది.
