Vizianagaram: రోజురోజుకు మనుషుల మధ్య అనుబంధాలు తగ్గిపోతున్నాయి. అనురాగాలు మాయమైపోతున్నాయి. దీంతో జరగకూడని దారుణాలు జరిగిపోతున్నాయి. అలాంటి ఘోరమే ఒకటి జరిగింది. ఈ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.
Also Read: రచ్చ రంబోలా.. నాని ప్యారడైజ్ తో ఏదో చేసేలా ఉన్నాడే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో కెరటం అనే గ్రామం ఉంది. ఈ క్రమంలో ఇటీవల కృష్ణ అనే ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు కృష్ణ ఫోన్ నంబర్ ఆధారంగా కేసు విచారణ మొదలుపెట్టారు. అయితే వారికి ఒక సంచలమైన విషయం తెలిసింది. దీంతో పోలీసులు ఒకసారి గా షాక్ కు గురయ్యారు.
కృష్ణకు ఒక సోదరి ఉంది. ఆ సోదరికి సాయి అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఇతడు ప్రస్తుతం కౌమార దశలో ఉన్నాడు. సాయి ఎత్తుకు ఎత్తు, అందానికి అందంగా ఉంటాడు..అతడు తరచూ మేనమామ కృష్ణ ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఇదే దశలో కృష్ణ భార్య సాయి మీద మనసు పడింది. అతనికి శారీరకంగా దగ్గర అయింది.. సాయి, తన భార్య కలిసి ఉండడాన్ని ఒకరోజు కృష్ణ చూసాడు. ఇద్దరిని మందలించాడు. ఇదే విషయాన్ని పెద్దమనుషుల సమక్షంలోకి తీసుకెళ్లాడు. వారు పంచాయతీ నిర్వహించి ఇకపై పద్ధతిగా ఉండాలని ఇద్దరికి సూచించారు. పెద్దమనుషుల సమక్షంలో తమ పద్ధతిగా ఉంటామని వారిద్దరు ఒప్పుకున్నారు.
పెద్దమనుషుల సమక్షంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో సాయి, కృష్ణ భార్య విఫలమయ్యారు. ఎప్పటిలాగే ఇద్దరు కలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం కృష్ణకు తెలియడంతో వారిద్దరిని నిలదీశాడు. దీంతో తప్పయిందని ఒప్పుకున్న వారిద్దరు.. కొద్దిరోజులు వేరువేరుగా ఉండడం మొదలుపెట్టారు. అయితే తాము ఇలా దూరంగా ఉండడానికి కారణం కృష్ణ అని కోపం పెంచుకున్న సాయి.. అతడిని చంపడానికి స్కెచ్ వేశాడు. దానిని అమలు చేశాడు. కృష్ణను హతమార్చి అతని శవాన్ని పాతిపెట్టాడు. కృష్ణ ఉన్నట్టుండి కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం మొదలైంది. ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే.. వారు విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతం సాయి పరారీలో ఉన్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.