Bro Movie Dialogues: పవన్ కళ్యాణ్ సినిమా వస్తుదంటే వైసీపీ నేతలు ఆసక్తిగా గమనిస్తారు. పవన్ తన సినిమాల్లో వారిని టార్గెట్ చేస్తారనేది నిజం. కమ్ బ్యాక్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాల్లో వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ చెలరేగిపోయారు. ‘శుక్రవారం వచ్చి సంతకం పెట్టి వెళ్ళు’ వంటి డైలాగ్స్ ఏపీ సీఎం జగన్ తో పాటు ఆ పార్టీ నేతలకు బాణాల్లా తగిలాయి. తన ఓటమి పై, ప్రత్యర్థుల గెలుపు పైన కూడా పవన్ కళ్యాణ్ ఘాటైన డైలాగ్స్ చెప్పారు.
ఇక ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా మారారు. వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వారాహి యాత్రతో ఇది పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ బ్రో మూవీలో వైసీపీ నేతలకు ఇచ్చి పడేస్తాడనే ప్రచారం జరిగింది. అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ కొన్ని సన్నివేశాల్లో రెచ్చిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ పై తరచుగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేసే అంబటి రాంబాబును పవన్ కళ్యాణ్ ట్రోల్ చేశారు.
ఆ మధ్య ఏపీ ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాలతో డాన్స్ చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. దీనికి సంబంధించిన రిఫరెన్స్ బ్రో మూవీలో పెట్టారు. అంబటి రాంబాబును తలపించేలా 30 ఇయర్స్ పృథ్విని సిద్ధం చేశారు. పృథ్వి డాన్స్ మీద పవన్ కళ్యాణ్ సెటైర్స్ వేశారు. పవన్ ట్రోల్ చేసిన విషయం మంత్రి రాంబాబుకు తెలిసేలా… ఆయన ధరించిన టీ షర్ట్ ని పోలిన టీ షర్ట్ పృథ్వితో వేయించారు. క్యారెక్టర్ పేరు శ్యామ్ బాబు అని పెట్టారు.
దాంతో పవన్ కళ్యాణ్ మంత్రి అంబటి రాంబాబును ట్రోల్ చేసిన విషయం స్పష్టమైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్స్ లో రికార్డు చేసిన వీడియో వైరల్ చేస్తున్నారు. మరి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ట్రోల్స్ పై స్పందిస్తాడో లేదో చెప్పాలి. బ్రో మూవీలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మరిన్ని డైలాగ్స్ ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేశారు.
repeat veyyalsinde..silent ga chaalane punch lu vesadu syambabu anta 😂😂 pic.twitter.com/bT1BIfpsl1
— KalyanFanatic (@gowrav_pk) July 28, 2023