https://oktelugu.com/

August 1 New Rules: క్రెడిట్ కార్డులు, వడ్డీ సహా ఆగస్టు నుంచి మారే అతి కీలక విషయాలు

కోబ్రాండెండ్ క్రెడిట్ కార్డుల్లో ఎక్కువ ప్రయోజనాలు అందించే ఫ్లిప్‌కార్ట్‌ క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో పెద్ద ఎత్తున కోత విధించింది. మింత్రా కొనుగోళ్లపై 5 శాతం ఇస్తున్న క్యాష్‌ బ్యాక్‌ను 1.5 శాతానికి తగ్గించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 28, 2023 5:29 pm
    August 1 New Rules

    August 1 New Rules

    Follow us on

    August 1 New Rules: గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గానూ ఐటీ రిటర్ను దాఖలు చేయాల్సిన గడువు జులై 31తో ముగియనుంది. ఆగస్టు 1 నుంచి రిటర్నులు ఫైలింగ్‌ చేసే వారిపై పెనాల్టీలు పడనున్నాయి. ఆదాయ పన్ను చట్టం 1961, సెక్షన్‌ 234F ప్రకారం.. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వచ్చే వారికి గరిష్టంగా రూ.1,000, రూ.5 లక్షలు దాటిన వారికి గరిష్టంగా రూ.5 వేల వరకు జరిమానా పడనుంది. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల్లో ప్రయోజనాలు, అమృత్‌ కలశ్‌ గడువు వంటివి ఆగస్టు నెలలో మారనున్నాయి. అవేంటి.. ఎలా మారనున్నాయో తెలుసుకుందాం.

    యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌
    కోబ్రాండెండ్ క్రెడిట్ కార్డుల్లో ఎక్కువ ప్రయోజనాలు అందించే ఫ్లిప్‌కార్ట్‌ క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో పెద్ద ఎత్తున కోత విధించింది. మింత్రా కొనుగోళ్లపై 5 శాతం ఇస్తున్న క్యాష్‌ బ్యాక్‌ను 1.5 శాతానికి తగ్గించింది. ఫ్యూయల్‌ కొనుగోళ్లు, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రాలో కొనుగోలు చేసే గిఫ్ట్‌ కార్డులు, ఈఎంఐ లావాదేవీలు, రెంటల్‌ పేమెంట్స్‌, ఆభరణాల కొనుగోళ్లలో ఇకపై ఎలాంటి క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఎత్తివేసింది. కొన్ని ఇతర కార్డుల ప్రయోజనాల్లోనూ యాక్సిస్‌ బ్యాంక్‌ కోత పెట్టింది.

    అమృత్‌ కలశ్‌..
    స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అమృత్‌ కలశ్‌ ఫిక్స్ డిపాజిట్‌ పథకం గడువు ఆగస్టులోనే ముగియనుంది. జూన్‌ 30తో గడువు ముగియాల్సి ఉండగా.. ఆగస్టు 15 వరకు పొడిగించారు. 400 రోజుల కాలవ్యవధితో ఉన్న ఈ పథకం కింద సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.

    బ్యాంకులకు సెలవులు..
    వరుస సెలవుల కారణంగా ఆగస్టు నెలలో బ్యాంకులు దాదాపు సగం రోజులు పనిచేయవంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం ఆగస్టులో శని, ఆదివారాలతో కలిపి దాదాపు 14 రోజుల పాటూ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. ఓనం, తిరువోణం, రక్షాబంధన్‌ పండుగల సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. రెండో, నాలుగో శనివారాలు, నాలుగు ఆదివారాలతోపాటు ఆగస్టు 15 (మంగళవారం) బ్యాంకులు పనిచేయవు. అంటే నెల మొత్తంలో 7 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.