https://oktelugu.com/

ఈటల నీకు ఏం అన్యాయం జరిగిందో చెప్పు: కేటీఆర్

బీజేపీ నేత ఈటల రాజేందర్ ది ఆత్మగౌరవం కాదని ఆత్మవంచన అని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఈటల తాను మోసపోతూ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో అందరికి గౌరవం ఇచ్చామని చెప్పారు. ఇన్నాళ్లు గౌరవం లేకపోతే పార్టీలో ఎందుకున్నారని ప్రశ్నించారు. అవగాహన లేమితో ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. టీఆర్ఎష్ లోనే సామాజిక న్యాయం అందరికి సమానంగా అందుతుందని చెప్పారు. లేనిపోని విషయాలపై ఫోకస్ పెట్టి అసలైన విషయాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 14, 2021 / 04:37 PM IST
    Follow us on

    బీజేపీ నేత ఈటల రాజేందర్ ది ఆత్మగౌరవం కాదని ఆత్మవంచన అని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఈటల తాను మోసపోతూ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో అందరికి గౌరవం ఇచ్చామని చెప్పారు. ఇన్నాళ్లు గౌరవం లేకపోతే పార్టీలో ఎందుకున్నారని ప్రశ్నించారు. అవగాహన లేమితో ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. టీఆర్ఎష్ లోనే సామాజిక న్యాయం అందరికి సమానంగా అందుతుందని చెప్పారు. లేనిపోని విషయాలపై ఫోకస్ పెట్టి అసలైన విషయాలు విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఈటల రాజేందర్ మంత్రిగా ఉంటూనే ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారన్నారు. తాను చేసిన తప్పులను తానే ఒప్పుకున్నారని తెలిపారు. ఈటలపై ప్రజల్లో సానుభూతి ఎందుకు ఉంటుందన్నారు. ఐదేళ్ల క్రితమే ఆత్మగౌరవం దెబ్బ తింటే ఇన్నాళ్లు ఎందుకున్నారని ప్రశ్నించారు. ఐదేళ్ల నుంచి ఈటల అడ్డంగా మాట్లాడినా మంత్రిగా ఉంచారని గుర్తు చేశారు. ఈటల టీఆర్ఎస్ లో కొనసాగేలా చివరి వరకు ప్రయత్నించారని వెల్లడించారు.

    బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు టీఆర్ఎస్ ఏం అన్యాయం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఏ ఎన్నికైనా పార్టీల మధ్యే కాని వ్యక్తుల మధ్య కాదన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందన్నారు. ఎన్ని పార్టీలున్నా టీఆర్ఎస్ దే గెలుపన్నారు.

    హుజురాబాద్ ఉప ఎన్నికలో మా పార్టీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపనలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని చేసినా చివరికి మాదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ కన్న తల్లి లాంటి పార్టీని వదిలి ఏ మేరకు మనగలుగుతారో చూస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.