spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhurandhar Movie Rahman Dacoit Role: 'ధురంధర్' లో రెహమాన్ డెకాయిట్ పాత్రని మిస్ చేసుకున్న...

Dhurandhar Movie Rahman Dacoit Role: ‘ధురంధర్’ లో రెహమాన్ డెకాయిట్ పాత్రని మిస్ చేసుకున్న ముగ్గురు హీరోలు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్..

Dhurandhar Movie Rahman Dacoit Role: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లో ‘ధురంధర్'(Dhurandhar Movie) మూవీ ప్రస్థానాన్ని సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొల్పాలంటే భారీ బడ్జెట్ VFX సినిమాలు అసలు అవసరం లేదు, స్క్రీన్ ప్లే తో పిచేక్కిస్తే చాలు, చరిత్ర తిరగరాయోచ్చు అని నిరూపించిన సినిమా ఇది. కేవలం 5 నెలల షూటింగ్ లో రెండు భాగాలకు సంబంధించిన సినిమాని పూర్తి చేశారు. ఇంత తక్కువ సమయం లో ఈ రేంజ్ కంప్లెక్స్ స్క్రీన్ ప్లే ఉన్న కథ ని ఇంత అద్భుతంగా చెప్పొచ్చా?, దర్శకత్వ ప్రతిభకు అసలైన నిర్వచనం అంటే ఇదే కదా అని నిరూపించిన చిత్రమిది. మొదటి భాగం 1380 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడితే , రెండవ భాగం 1600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను దాటి , 2000 కోట్ల వైపు అడుగులు వేస్తోంది.

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం స్టోరీ , స్క్రీన్ ప్లే అయినప్పటికీ , నటీనటుల అద్భుతమైన నటన కూడా మరో కారణం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మొదటి భాగం లోని రెహమాన్ డెకాయిట్ పాత్ర , ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక సంచలనం అనే చెప్పాలి. మరో పాతికేళ్ల తర్వాత కూడా విలన్ క్యారెక్టర్ అంటే ఈ రేంజ్ లో ఉండాలి , ఈ రేంజ్ లో నటించాలి అనిపించాడు అక్షయ్ ఖన్నా. ఇప్పటి వరకు ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాడు కానీ , ఈ సినిమాలో పోషించిన రెహమాన్ డెకాయిట్ పాత్ర గురించి తరాలు మాట్లాడుకుంటాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఆసక్తి కరమైన విషయాలను , ఆ చిత్రానికి క్యాస్టింగ్ డైరెక్టర్ గా పని చేసిన ముకేశ్ చాబ్రా చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘రెహ్మాన్ డెకాయిట్ పాత్రని ముగ్గురు టాప్ నటులు రిజెక్ట్ రిజెక్ట్ చేశారు. అందులో ఒకరు సౌత్ కి సంబంధించిన నటుడు కాగా, మిగిలిన ఇద్దరు బాలీవుడ్ కి చెందిన నటులు. వాళ్ళు అలా రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే , ఈ చిత్రం లో చాలా ఎక్కువమంది నటిస్తున్నారని , అంతే కాకుండా ఇది పూర్తిగా రణవీర్ సింగ్ సినిమా అని రిజెక్ట్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు. రణవీర్ సింగ్ అప్పటికీ వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు , అలాంటి హీరో కి ఇంత పెద్ద సినిమా ఇవ్వడం పై బహుశా జీర్ణించుకోలేకపోయుండొచ్చని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు , ఈ చిత్రం లో నటించడానికి అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి వారు కూడా గొప్పగా ఆసక్తి చూపలేదట , ఓకే చెప్పడానికి చాలా సమయం తీసుకున్నారని, ఒక్క మాధవన్ మాత్రమే కథ విన్న వెంటనే ఓకే చెప్పాడని చెప్పుకొచ్చాడు ముకేశ్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular