Homeఎంటర్టైన్మెంట్Dhurandhar Netflix Record: 'నెట్ ఫ్లిక్స్' లో 'ధురంధర్' మరో సంచలన రికార్డు.. 'వారణాసి' కి...

Dhurandhar Netflix Record: ‘నెట్ ఫ్లిక్స్’ లో ‘ధురంధర్’ మరో సంచలన రికార్డు.. ‘వారణాసి’ కి చాలా పెద్ద టార్గెట్..

Dhurandhar Netflix Record: ఒకపక్క ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తూ, అనితర సాధ్యమైన రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంటే, మరోపక్క ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం నెట్ ఫ్లిక్స్ లో రోజుకో మైల్ స్టోన్ ని దాటుతూ ముందుకు వెళ్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో కేవలం హిందీ బాషలోనే విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ తో పాటు, ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు కాబట్టి కచ్చితంగా ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదని ముందుగా అందరూ ఊహించారు. కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని మాత్రం నిజంగా ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై 8 వారాలు పూర్తి అవ్వగా, ఈ 8 వారాలకు గానూ దాదాపుగా 26.3 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Also Read: పవన్ కళ్యాణ్ తో ‘ధురంధర్ 2’ డైరెక్టర్ ఆదిత్య డర్ భేటీ.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ లోడింగ్..

ప్రస్తుతం ఈ చిత్రం టాప్ 1 స్థానం లో ట్రెండ్ అవుతోంది. ఇంగ్లీష్ సినిమాలు / వెబ్ సిరీస్ లు కాకుండా, ఒక నాన్ ఇంగ్లీష్ చిత్రం వరుసగా 8 వారాలు ట్రెండ్ అయిన అరుదైన ఇండియన్ చిత్రాల్లో ‘ధురంధర్’ కూడా చేరిపోయింది. వారాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వ్యూస్ ని ఒకసారి పరిశీలిస్తే , మొదటి వార లో 7.6 మిలియన్ వ్యూస్ రాగా, రెండవ వారం లో 8.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఆ తర్వాత మూడవ వారం 2.9 మిలియన్ వ్యూస్ ని ఈ చిత్రం రాబట్టగా, నాల్గవ వారం లో 2 మిలియన్ వ్యూస్ , 5వ వారం లో 1.3 మిలియన్ వ్యూస్, 6 వ మరియు 7 వ వారాల్లో చెరో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలుస్తోంది. ఇక 8 వ వారం లో ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ విడుదల అవ్వడం తో వ్యూస్ భారీగా పెరిగాయి.

నెట్ ఫ్లిక్స్ సంస్థ అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 8 వ వారం లో 2.3 మిలియన్ వ్యూస్ వచ్చాయట. సీక్వెల్ థియేటర్స్ లో ఆడుతున్న సమయం లో కచ్చితంగా ఆ చిత్రాన్ని చూడాలి అనుకున్న ప్రేక్షకుడు, మొదటి భాగాన్ని చూస్తాడు కదా, అందుకే ఆ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఊపులో ముందుకు పోతే త్వరలోనే ఈ చిత్రం #RRR(43 మిలియన్ వ్యూస్) రికార్డు ని దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒకపక్క వెండితెర ని ఈ సినిమా సీక్వెల్ రూల్ చేస్తుంటే, బుల్లితెర ని మొదటి భాగం రూల్ చేస్తోంది. అలా డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఇండియా లో ‘ధురంధర్’ మేనియా తప్ప మరొకటి కనిపించడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...

Qualities Women Like In Men: ఈ 7 లక్షణాలు మీలో ఉన్నాయా.. మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు..

Qualities Women Like In Men: ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఇష్టపడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఒక పురుషుడిని ఒక మహిళ ఏ విషయంలో ఇష్టపడుతారు? అనే సందేహం ఇప్పటికీ...

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...
Oktelugu Epaper
Exit mobile version