Dhurandhar Movie OTT Release: ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలందరు సక్సెస్ ల కోసం పరుగులు తీస్తున్నారు. గతంలో వాళ్ళు చేసిన సినిమాలన్ని సక్సెస్ లను సాధించినప్పటికి ఈ మధ్యకాలంలో వాళ్ళు చేసే సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. తద్వారా వరుసగా డిజాస్టర్లను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా రన్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘దురంధర్’ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు సాగుతోంది… ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అవుతోంది అంటూ కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నెట్ ఫిక్స్ వాళ్లు ఈ సినిమాని ఫ్యాన్సీ రేటు కి కొనుగోలు చేశారు. మరో వారం రోజుల్లో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ lలోకి రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. నిజానికి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ సినిమాను ఇప్పుడప్పుడే నెట్ ఫ్లిక్స్ లోకి తీసుకురావడం ఎందుకు అని కొంతమంది వాదిస్తుంటే…
ముందుగానే మూవీ రిలీజ్ కి ముందే నెట్ ఫ్లిక్స్ సంస్థ సినిమా యాజమాన్యంతో ఒక ఒప్పందం కుదుర్చుకుందట. సినిమా రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత ఓటీటీ లో రిలీజ్ చేసుకుంటాం అంటూ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. మొత్తానికైతే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా తొందరలోనే సందడి చేయబోతుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది…
ఇక ఈ సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అయింది. అయినప్పటికి తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమాని చూడడానికి ఆసక్తి చూపించారు. రన్వీర్ సింగ్ యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది. ఆయన తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ ను చూపిస్తూ ఆయన కనబరిచిన యాక్టింగ్ బాగుంది.
ఇక మొత్తానికైతే రన్వీర్ సింగ్ సైతం ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు. అతనికి ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలేవి కలిసి రావడం లేదు… ఎట్టకేలకు దురంధర్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్లో సీక్వెల్ ఉంటుందని ప్రకటించినప్పటికి ఇప్పుడే పార్ట్ 2 ఉంటుందా? లేదంటే మరికొద్ది రోజుల తర్వాత సినిమా స్టార్ట్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది…