Dhurandhar Beat Pusha 2: ఈ ఏడాది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సినిమాల్లో ఒకటి రీసెంట్ గా విడుదలైన ‘దురంధర్'(Durandhrar Movie). రణవీర్ సింగ్(Ranveer Singh) హీరో గా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కి ఆడియన్స్ లో విడుదలకు ముందే ట్రైలర్ ద్వారా మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది. మరో యానిమల్ రేంజ్ సెన్సేషన్ ని ఈ చిత్రం క్రియేట్ చేయబోతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఈ చిత్రం యానిమల్ ని మాత్రమే కాదు, పుష్ప 2 ని కూడా డామినేట్ చేసే రేంజ్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది. వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ బాగా తగ్గిపోతాయేమో అని అనుకుంటే, సోమవారం వచ్చిన వసూళ్లకంటే, మిగిలిన వర్కింగ్ డేస్ లో వచ్చిన వసూళ్లు ఎక్కువ ఉండడం గమనార్హం. ముఖ్యంగా నిన్న, అనగా రెండవ శుక్రవారం ఈ చిత్రానికి పుష్ప 2 కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయట.
పుష్ప 2 చిత్రానికి రెండవ శుక్రవారం 27 కోట్ల 50 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు రాగా , దురంధర్ చిత్రానికి ఏకంగా 34 కోట్ల 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి 8 రోజుల్లో 252 కోట్ల 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈరోజు రేపు వచ్చే వసూళ్లు ఊహకి కూడా అందవు అనే చెప్పాలి. శనివారం రోజున 48 కోట్లు, ఆదివారం రోజున 60 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో ఎంతవరకు నిజం అవ్వుద్దో చూడాలి. ఇక రెండవ శుక్రవారం అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల విషయానికి దురంధర్ మరియు పుష్ప 2 చిత్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా, చావా చిత్రం 24 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి మూడవ స్థానం లో నిల్చింది.
ఇక ఆ తర్వాత యానిమల్ చిత్రం 23 కోట్ల 53 లక్షలతో నాల్గవ స్థానం లో కొనసాగగా, 20 కోట్ల రూపాయిల నెట్ తో గద్దర్ 2 , 19 కోట్ల 75 లక్షల రూపాయలతో బాహుబలి 2 చిత్రాలు కొనాగుతున్నాయి. అయితే వీటిల్లో ఒక్క ఖాన్ సినిమా కూడా లేకపోవడం గమనార్హం. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర తర్వాత బాలీవుడ్ ని శాసించిన ఖాన్స్, ఇప్పుడు వరుస ఫ్లాప్స్ లో ఉన్నారు. షారుఖ్ ఖాన్ కం బ్యాక్ ఇచ్చి జవాన్, పఠాన్ చిత్రాలతో వరుసగా రెండు సార్లు వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టినప్పటికీ, ఆ సినిమాలు లాంగ్ పీరియడ్ లో జనాల మనస్సులో స్థానం సంపాదించుకోలేకపోయాయి. ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం సౌత్ హీరోలు మరియు బాలీవుడ్ యువ హీరోల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దురంధర్ చిత్రం రాబోయే రోజుల్లో వెయ్యి కోట్ల గ్రాస్ ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.