spot_img
Homeఎంటర్టైన్మెంట్Tollywood heroes praising Dhurandhar 2: ఇది అన్యాయం.. 'దురంధర్ 2' కు టాలీవుడ్ హీరోలు...

Tollywood heroes praising Dhurandhar 2: ఇది అన్యాయం.. ‘దురంధర్ 2’ కు టాలీవుడ్ హీరోలు అందుకే భజన చేశారు..

Tollywood heroes praising Dhurandhar 2: దేశంలోని మూవీ లవర్స్ అందరూ ఇప్పుడు ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) మేనియాలో మునిగి తేలుతున్నారు. మొదటి వారం లోనే వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే దిశగా ముందుకు దూసుకుపోతున్న ఈ చిత్రం మేనియా , కేవలం నార్త్ ఇండియా లోనే కాదు , సౌత్ లో కూడా చాలా బలంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి కాసుల కనకవర్షం కురుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి క్లోజింగ్ లో 50 కోట్ల గ్రాస్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా పక్కన పెడితే టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలంతా ఒకరి తర్వాత ఒకరు ఈ సినిమా గురించి ట్వీట్లు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ మన హీరోలు ఏ సినిమా గురించి కూడా ఈ రేంజ్ లో ట్వీట్లు వెయ్యలేదు.

కానీ అకస్మాత్తుగా ఇప్పుడు ఎందుకు అందరూ ‘ధురంధర్ 2 ‘ భజన చేస్తున్నాడు. బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్మెంట్ లో ఉంది కాబట్టి, ఆ పార్టీ నాయకులూ స్పెషల్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఇలా ట్వీట్లు వేస్తున్నారా ?, లేదంటే మూవీ టీం రిక్వెస్ట్ చేయడం వల్ల ట్వీట్స్ వేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. చాలా మంది చెప్తున్నది ఏంటంటే, ఆదిత్య డర్ ని మచ్చిక చేసుకొని , అతనితో తమ తదుపరి చిత్రాన్ని లాక్ చేయించే ప్లాన్ లోనే ఇలా వరుసగా ట్వీట్లు వేస్తున్నారని అంటున్నారు. మేము ఉన్నాము, గుర్తుంచుకో, మాతో సినిమా లాక్ చెయ్యి అని చెప్పడానికే ఇలా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, ఒకవేళ అదే నిజమైతే మాత్రం చాలా అన్యాయం అనే చెప్పాలి.

Also Read: ఎక్స్ క్లూజివ్: టాలీవుడ్ హీరోతో ‘ధురంధర్’ దర్శకుడి తదుపరి చిత్రం

ఎందుకంటే ఈ సినిమాతో పాటు మన టాలీవుడ్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కూడా ఉంది. దీని గురించి మన టాలీవుడ్ హీరోలు ఒక్కరు కూడా ట్వీట్ వెయ్యలేదు. కనీసం మెగా హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు కూడా పట్టించుకోలేదు. తమ సినిమాల టికెట్ రేట్స్ కోసం డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆఫీస్ డోర్ల ముందు నిలబడే స్టార్ హీరోలు , నిర్మాతలు , ఇప్పుడు మాత్రం ఆయన సినిమా విడుదలైనప్పుడు కనీసం ఆల్ ది బెస్ట్ అనే ట్వీట్స్ కూడా వేయకపోగా , పక్క ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమాకు భజన చేయడా ఏ మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version