spot_img
Homeఎంటర్టైన్మెంట్Aditya Dhar next movie: ఎక్స్ క్లూజివ్: టాలీవుడ్ హీరోతో 'ధురంధర్' దర్శకుడి తదుపరి చిత్రం

Aditya Dhar next movie: ఎక్స్ క్లూజివ్: టాలీవుడ్ హీరోతో ‘ధురంధర్’ దర్శకుడి తదుపరి చిత్రం

Aditya Dhar next movie: దేశం మొత్తం ఇప్పుడు మారు మోగిపోతున్న పేరు ఆదిత్య డర్(Aditya Dhar). ఒకప్పుడు ఈయన పేరు బాలీవుడ్ వాళ్లకు కూడా పూర్తిగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఇతన్ని రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడికి పోటీ అని పిలుస్తున్నారు. నిజంగా ‘ధురంధర్’ చిత్రం లో ఇతని పనితనం చూస్తే , రాజమౌళి లాంటోళ్ళతో పోల్చడం లో ఎలాంటి తప్పు లేదని అనిపిస్తుంది. ఈ సినిమా ప్రభావం కేవలం ఇండియా లోనే కాదు, పాకిస్థాన్ లో కూడా చాలా బలంగా ఉంది. ఈ చిత్రం విడుదల తర్వాత పాకిస్థాన్ పోలీసులు ఇండియన్ స్పై ఏజెంట్స్ ఉన్నారేమో అని , వీధుల్లో పడుకొని ఉన్న బిచ్చగాళ్లను తనిఖీ చేయడం వంటివి ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో కొన్ని వీడియోల రూపం లో మనం చూశాము. ఒక్కమాటలో చెప్పాలంటే ఆదిత్య డర్ పాకిస్థాన్ వాళ్లకు వెన్నులో వణుకు పుట్టించాడు అని చెప్పొచ్చు.

ఇదంతా అతని అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ. ఇలాంటి డైరెక్టర్ తో పని చెయ్యాలని ఏ హీరో కి ఉండదు చెప్పండి..?, అయితే ఆదిత్య డర్ తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ హీరో తోనే చెయ్యబోతున్నాడు అట. ఆ హీరో మరెవరో కాదు , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య రీసెంట్ గానే ముంబై లో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఆదిత్య డర్ సాధారణమైన కమర్షియల్ ఫార్మాట్ లో కానీ, లేదా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ గ్రాండియర్ ఫార్మాట్ lo కానీ , సినిమాలు చేసే రకం కాదు. ఆయన స్టైల్ వేరే. నేషనల్ లెవెల్ లో ఉన్న సమస్యలను ఆధారంగా తీసుకొనే ఆయన సినిమాలు చేస్తుంటాడు, అది కూడా యదార్ధ సంఘటనల ఆధారంగానే. ‘ధురంధర్’ కి ముందు ఆయన URI, ఆర్టికల్ 360 వంటి సినిమాలు చేసాడు. ఈ రెండు సినిమాలు కూడా యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని చేసిన దేశభక్తి సినిమాలే.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాల ట్రెండ్ ముగిసినట్టే ..

ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా అదే తరహా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రధాన సమస్యలన్నీ కవర్ చేసి సినిమాలు చేసేసాడు, ఇప్పుడు అల్లు అర్జున్ తో ఏ అంశం పై సినిమా చేస్తాడు అనేది సస్పెన్స్. ఆదిత్య డర్ బుర్ర ని ఎవ్వరూ అంచనా వెయ్యలేరు. పాకిస్థాన్ లో ఇండియన్ స్పై అడుగుపెట్టి , అక్కడి రాజకీయాలను శాసించి, ఎలా టెర్రరిజాన్ని ఆ దేశం నుండి పీకేసాడు అనే ఆలోచన ఇంతకు ముందు ఏ డైరెక్టర్ కి అయినా వచ్చిందా? , ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా అలాంటి విభిన్నమైన పాయింట్ తోనే సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాబోయే రోజుల్లో బయటకు రానున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version