spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Movie Advance Bookings: #RRR , పుష్ప 2 , ఓజీ చిత్రాల...

Dhurandhar 2 Movie Advance Bookings: #RRR , పుష్ప 2 , ఓజీ చిత్రాల తర్వాత ఆ ఘనత ‘ధురంధర్ 2’ కే దక్కింది..!

Dhurandhar 2 Movie Advance Bookings: కాసేపటి క్రితమే ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ ద్వారా మొదలైంది. ఈ సినిమా కోసం యూత్ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూశారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇది సాధారమైన విషయం కాదు. ఇప్పటి వరకు ఒక్క బాలీవుడ్ చిత్రానికి కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవ్వలేదు. కేవలం మొదటి రోజునే ఈ చిత్రానికి బుక్ మై షో + డిస్ట్రిక్ట్ యాప్ కలిపి 20 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వలేదు. అయితే ఈ చిత్రానికి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వంద కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్న సినిమాలు కేవలం మూడు మాత్రమే .

Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?

ఒకటి రాజమౌళి తెరకెక్కించిన #RRR మూవీ కాగా, ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రానికి కూడా ఇదే తరహా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ రెండు సినిమాల తర్వాత గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ ‘ చిత్రానికి కూడా విడుదలకు ముందు 100 కోట్ల రూపాయిల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ మూడు సినిమాల తర్వాత మళ్లీ అలాంటి ఛాన్స్ ప్రభాస్ ‘స్పిరిట్’, రాజమౌళి ‘వారణాసి ‘ చిత్రాలకు మాత్రమే దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ‘ధురంధర్ 2 ‘ చిత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో మధ్యలోకి ఎంట్రీ ఇచ్చింది. గత కొంతకాలం గా సౌత్ సినిమాల డామినేషన్ ని తట్టుకొని విలవిలలాడిన బాలీవుడ్ , ఈ సినిమాతో మరోసారి తలెత్తుకుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రీమియర్ షోస్ నేడు అనేక ప్రాంతాల్లో రద్దు అయ్యింది. PVR లో సాయంత్రం నుండి కంటెంట్ ని అప్లోడ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే కుదరడం లేదట. మరో గంటకు పైగా సమయం పెట్టె అవకాశం ఉందని అంటున్నారు. కానీ హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో కాసేపటి క్రితమే షోస్ ని మొదలు పెట్టారు. అలా చివరి నిమిషం లో కంటెంట్ ఆలస్యం అవ్వడం తెలుగు వెర్షన్ కి సంబంధించిన షోస్ మొత్తం రద్దు అయ్యాయి. అదే విధంగా ‘డాళ్బీ విజన్’ వెర్షన్ కూడా రెడీ అవ్వలేదట. మరో 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular