Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 collections drop: 'ధురంధర్ 2' కలెక్షన్స్ అకస్మాత్తుగా పడిపోవడానికి కారణాలు ఇవే..

Dhurandhar 2 collections drop: ‘ధురంధర్ 2’ కలెక్షన్స్ అకస్మాత్తుగా పడిపోవడానికి కారణాలు ఇవే..

Dhurandhar 2 collections drop: భారీ అంచనాల నడుమ ఉగాది/ రంజాన్ పర్వదినాలను పురస్కరించుకొనిన విడుదల చేసిన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం కమర్షియల్ గా ఎంతటి భారీ ఓపెనింగ్ తో మొదలైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి వారం లోనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఊపుని చూసి కచ్చితంగా 2000 కోట్ల మార్కుని అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు […]

Dhurandhar 2 collections drop: భారీ అంచనాల నడుమ ఉగాది/ రంజాన్ పర్వదినాలను పురస్కరించుకొనిన విడుదల చేసిన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం కమర్షియల్ గా ఎంతటి భారీ ఓపెనింగ్ తో మొదలైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి వారం లోనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఊపుని చూసి కచ్చితంగా 2000 కోట్ల మార్కుని అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, మొదటి వారం పూర్తి అవ్వగానే వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి. ఈ రేంజ్ డ్రాప్స్ ని ఎవ్వరూ ఊహించలేదు. సోమవారం రోజున ఏకంగా 20 కోట్ల నెట్ వసూళ్లకు పడిపోయింది ఈ చిత్రం. ముందు రోజుతో పోలిస్తే 70 శాతం డ్రాప్స్ అన్నమాట. మంగళవారం రోజున 24 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రతీ సినిమాలు సోమవారం వచ్చే వసూళ్లకంటే మంగళవారం వచ్చే వసూళ్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మంగళవారం రోజున నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఆఫర్స్ ఉంటాయి కాబట్టి. ‘ధురంధర్’ చిత్రానికి మొదట్టి సోమవారం 29 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తే , 2 వ మంగళవారం ఏకంగా 32 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ‘ధురంధర్ 2’ కి మొదటి భాగం కి వచ్చినంత రన్ రాకపోవడం గమనార్హం. అకస్మాత్తుగా ఈ సినిమా రన్ రెగ్గిపోవడానికి మొదటి కారణం IPL సీజన్ మొదలు అవ్వడమే. ముఖ్యంగా ఫస్ట్ షోస్ భారీగా డ్రాప్ అవుతున్నాయి. యూత్ మొత్తం IPL కి ఎవ్వరూ ఊహించనంత రేంజ్ లో అడిక్ట్ అయిపోయారు. ఇక రెండవ రీసన్ ఏంటంటే , ఈ చిత్రంలో బీజేపీ పార్టీ భజన చేశారనే ప్రచారం జరగడం. మొదటి భాగం లో కేవలం యదార్ధ సంఘటనల ఆధారంగా స్క్రీన్ ప్లే నడుస్తుంది.

Also Read: ప్రభాస్ ‘స్పిరిట్’ కథ ఇంత రొటీన్ గా ఉండబోతుందా.. ? ఇలా అయితే కష్టమే..

కానీ ఈ సినిమాలో కొన్ని చోట్ల బీజేపీ పార్టీ భజన చాలా గట్టిగా చేశారు అనే భావన కలుగుతుంది. అందుకే ఆ పార్టీ ని ఇష్టపడని వాళ్ళు ఈ సినిమాని చూడడం ఆపేశారని, ఆ కారణం వల్ల కూడా వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయని అంటున్నారు. కానీ ట్రేడ్ పండితులు చెప్తున్న మాట ఏమిటంటే , ఈ సినిమాకు మూవీ లవర్స్ సంబంధించిన టికెట్స్ మొత్తం ఇప్పటికే సేల్ అయిపోయాయి. ఇప్పుడు కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ టికెట్స్ మాత్రమే తెగుతున్నాయి. కాబట్టి ఇదే స్టడీ రన్ మరో 20 రోజుల పాటు ఉంటుంది , కచ్చితంగా 2000 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఈ సినిమా చేరుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరి వాళ్ళ అంచనా ప్రకారం కలెక్షన్స్ స్టడీ గా ఉంటాయా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper