Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 10 days Worldwide Collections: 'ధురంధర్ 2' 10 రోజుల వరల్డ్ వైడ్...

Dhurandhar 2 10 days Worldwide Collections: ‘ధురంధర్ 2’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. 9 ఏళ్ళ ‘బాహుబలి 2’ రికార్డు అవుట్..

Dhurandhar 2 10 days Worldwide Collections: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేస్తూ , విజయవంతంగా 10 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారాం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 10 వ రోజున 63 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు కేవలం […]

Dhurandhar 2 10 days Worldwide Collections: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేస్తూ , విజయవంతంగా 10 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారాం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 10 వ రోజున 63 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు కేవలం ఇండియన్ మార్కెట్ నుండి వచ్చిందట. నెట్ వసూళ్లు దాదాపుగా 57 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు అట. ఇతర హిందీ సినిమాలకు మొదటి రోజు కూడా ఈ రేంజ్ నెట్ వసూళ్లను రాబట్టడం లేదు. అలాంటిది ఈ చిత్రం 10 వ రోజున కూడా ఈ రేంజ్ నెట్ వసూళ్లను రాబట్టడాన్ని చూస్తుంటే , మరో మూడు వారాల పాటు ఈ చిత్రానికి ఇదే రేంజ్ వసూళ్లు ఉండొచ్చని అంటున్నారు.

ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి కేవలం హిందీ వెర్షన్ నుండి 696 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 821 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అదే విధంగా డబ్బింగ్ బాషల (తమిళ్ + తెలుగు + కన్నడ ) నుండి 51 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రం 33 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 313 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. నార్త్ అమెరికా లో అయితే ఈ చిత్రం 9 ఏళ్ళ నుండి చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ‘బాహుబలి 2’ ఫుల్ రన్ రికార్డుని కూడా దాటసింది. నార్త్ అమెరికా లో బాహుబలి 2 చిత్రానికి ఫుల్ రన్ లో 22 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

‘ధురంధర్ 2 ‘ చిత్రానికి ఈ 10 రోజుల్లో 23 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు నార్త్ అమెరికా నుండి వచ్చాయట. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ చిత్రం 30 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 1185 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ పూర్తి అయ్యే సరికి 1300 కోట్ల మార్కు ని కూడా దాటేసి ఉంటుందని అంటున్నారు. ‘ధురంధర్’ చిత్రానికి క్లోజింగ్ లో వచ్చిన వసూళ్లు ఇవి. వచ్చే వారం కూడా మంచి థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటే క్లోజింగ్ లో 2000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలబడే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper