https://oktelugu.com/

Mokshagna Teja: మోక్షజ్ఞకు విలన్ గా స్టార్ హీరో కొడుకును దించిన ప్రశాంత్ వర్మ, మైండ్ బ్లోయింగ్ అప్డేట్!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్యాస్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మోక్షజ్ఞకు విలన్ గా ఓ స్టార్ హీరో కొడుకును సిద్ధం చేశారన్న వార్త టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.

Written By:
  • S Reddy
  • , Updated On : November 16, 2024 / 10:48 AM IST

    Mokshagna Teja

    Follow us on

    Mokshagna Teja: ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణ అభిమానుల కల నెరవేరింది. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలంగా మోక్షజ్ఞ అరంగేట్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞకు హీరో కావడం ఇష్టం లేదనే ప్రచారం కూడా జరిగింది. మోక్షజ్ఞ మనసు మారాలని బాలకృష్ణ యజ్ఞ యాగాదులు కూడా చేశారట. 30 ఏళ్ల వయసులో మోక్షజ్ఞ హీరోగా మారనున్నారు.

    మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బాలకృష్ణ చాలా కసరత్తే చేశారు. కథ, దర్శకుడు ఎంపిక విషయంలో తర్జనభర్జన పడ్డారు. పలువురు స్టార్ దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా మోక్షజ్ఞను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసే బాధ్యత ప్రశాంత్ వర్మ తీసుకున్నాడు. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ ఓ సోషియో ఫాంటసీ సబ్జెక్టు సిద్ధం చేశారట. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తీర్చిద్దాలని ప్రణాళికలు వేస్తున్నారు.

    ఇక మోక్షజ్ఞతో జతకట్టే హీరోయిన్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. శ్రీలీల పేరు ప్రముఖంగా వినిపించింది. బాలకృష్ణకు శ్రీలీల అత్యంత సన్నిహితురాలు. మోక్షజ్ఞతో ఆమెకు పరిచయం కూడా ఉంది. దాంతో శ్రీలీల-మోక్షజ్ఞ కాంబో సెట్ అయ్యిందని కథనాలు వెలువడ్డాయి. ఇటీవల మరొక పేరు తెరపైకి వచ్చింది. మాజీ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీ ఎంపికైందట. ఆమెపై ప్రశాంత్ వర్మ ఫోటో షూట్ కూడా చేశారని అంటున్నారు.

    మరొక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో విలన్ గా ఓ స్టార్ హీరో కొడుకు నటిస్తున్నాడట. ఆయనెవరో కాదు ధృవ్ విక్రమ్. తమిళ్ స్టార్ విక్రమ్ కి తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఆయన కుమారుడు ధృవ్ తమిళంలో హీరోగా చిత్రాలు చేస్తున్నాడు. పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. ఇంకా బ్రేక్ రాలేదు.

    ధృవ్ అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రసుతం బైసన్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. మోక్షజ్ఞ మూవీలో విలన్ రోల్ కోసం ధృవ్ ని ప్రశాంత్ వర్మ సంప్రదించాడట. ఆయన ఓకే చెప్పాడట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ప్రముఖంగా ప్రచారం అవుతుంది. అదే నిజమైతే ప్రేక్షకులు అదిరిపోయే కాంబో సిల్వర్ స్క్రీన్ పై ఎంజాయ్ చేస్తారు.