https://oktelugu.com/

Rayapati Aruna: రాయపాటి అరుణ.. వైసీపీ వాళ్లలాగా ఏంటమ్మా ఈ దారుణం?

ఏదైనా చెప్పడం ఈజీ.దానిని ఆచరించడమే అతి కష్టం.సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తల పోస్టులు బాగాలేదని జనసేన విమర్శిస్తోంది. ఇప్పుడు అటువంటి మాటలే జనసేన నేతల నోటి నుంచి వస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

Written By: Dharma, Updated On : November 16, 2024 11:28 am
Rayapati Aruna

Rayapati Aruna

Follow us on

Rayapati Aruna జనసేన మహిళా నేతల్లో రాయపాటి అరుణ ఒకరు.జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆమె పార్టీ గొంతును బలంగా వినిపిస్తుంటారు.టీవీ డిబేట్లో సైతం పార్టీ తరఫున మాట్లాడుతుంటారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.అదే సమయంలో వివాదాస్పద కామెంట్లు చేస్తుంటారు. గతంలో ఆమె చిరంజీవిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి.సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.చిరంజీవి ప్రజారాజ్యం,కాంగ్రెస్లో విలీనం,తిరిగి సినిమాలు చేయడంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. జనసైనికులు సైతం మండిపడ్డారు. దీంతో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా మరోసారి రాయపాటి అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో వైసీపీ సోషల్ మీడియాపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు ప్రారంభమయ్యాయి. అరెస్టుల పర్వం కొనసాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల జరిగింది. అయితే ఇటువంటి సమయంలో జనసేన మహిళా నేత జగన్ కుటుంబం పై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మాదిరిగా కామెంట్స్ చేయడం విశేషం.

* జగన్ పై అనుచిత వ్యాఖ్యలు
ఓ టీవీ డిబేట్ కు హాజరైన రాయపాటి అరుణ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.రకరకాల మాటలు చెప్పారు.ఈ క్రమంలో జగన్ పుట్టుకపై మాట్లాడారు.ఆయన పుట్టుకపై మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు.ఆ ఇంట్లో మహిళలపై మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. అయితే జనసేన తరఫున ఆవేదనను వ్యక్తపరిచే క్రమంలోఅరుణ ఈ తరహా కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో సదరు ఛానల్ జర్నలిస్టు అరుణను ఆపే ప్రయత్నం చేశారు. అటువంటి కామెంట్స్ చేయకూడదని పలికారు. ప్రస్తుతం అరుణ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ నేతల వ్యవహార శైలిని తప్పుపడుతున్న క్రమంలో.. అరుణ కామెంట్స్ సైతం విమర్శలకు కారణమవుతున్నాయి.

* వారిని నియంత్రించాల్సిందే
జనసేనలో వివాదాస్పద నేతలను నియంత్రించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు జరుగుతున్నాయి.వందలాదిమందిపై కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి జన సేన శ్రేణులు. వైసీపీని తప్పుపడుతూ సొంత పార్టీ నేతలే అలా మాట్లాడితే అది అంతిమంగా పవన్ కు చేటు తెస్తుంది. అందుకే రాయపాటి అరుణ లాంటి నేతల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని జనసైనికులు కొందరు సూచిస్తున్నారు. లేకుంటే మాత్రం వైసీపీకి వచ్చిన అపవాదు.. జనసేన పై వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. మరి నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.