Dhrushyam 2: రీమేక్ సినిమాలతో వరుస హిట్లు కొడుతూ.. ఓ వైపు కామెడీ సినిమాలు చూస్తూనే మరోవైపు యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ.. ప్రేక్షకుల నుంచి మెప్పు పొందుతున్నారు విక్టరి వెంకటేశ్. ఇటీవలే వెంకి నటించిన నారప్ప సినిమాఅమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇదే జోరుతో మరోసారి రీమేక్ సినిమాతో పలకరించేందుకు సిద్ధమయ్యారు వెంకటేశ్. గతంలో మీనా, వెంకటేశ్ ప్రధానపాత్రలో నటించిన దృశ్యం సినిమా ఎంత సూపర్ హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే జోరుతో మరోసారి హిట్ కొట్టేందుకు దృశ్యం 2తో వస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. కరోనా, తదితర అంశాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా, ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అనుకోని ఆపదల వల్ల తమ కుటుంబాన్ని, ముఖ్యంగా, కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడన్నదే ఈ కథ.
The truth has begun to unveil itself. But the question is – has it left a permanent scar on Rambabu?
Watch #Drushyam2OnPrime, Nov. 25 on @PrimeVideoIN
▶️https://t.co/mL68iUtwzC#MeenaSagar #JeetuJoseph @SureshProdns @aashirvadcinema @antonypbvr @anuprubens #SatheeshKurup pic.twitter.com/YTkirX6oBH
— Venkatesh Daggubati (@VenkyMama) November 12, 2021
మలయాళంలో సూపర్ హీట్‌గా నిలిచిన దృశ్యం 2కు రీమేక్‌గా ఈ సినిమాకు తెరకెక్కిస్తున్నారు. మాతృక సినిమాకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు రీమేక్‌కు కూడా డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 25న విడుదల కానుంది. దీంతో నెటిజన్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.