నాగార్జున మొదటి భార్య లక్ష్మి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు..!: ప్రపంచంలో అమ్మకున్న విలువ మరేదానికి ఉండదు. అమ్మను మించిన దైవం ఉన్నదా..? అని సాంగ్ రూపంలో వచ్చినా.. అది నిజమే. ఓ బిడ్డకు అమ్మ పంచే ప్రేమ మరెక్కడా దొరకదు. అమ్మ గొప్పదనం గురించ సినిమాలు కూడా బాగానే వచ్చాయి. ‘అమ్మ రాజీనామా’ తదితర సినిమాలు కూడా చాలా మంచిపేరు తీసుకొచ్చాయి. అయితే సినీ ఫీల్డుకు సంబంధించి ఓ అమ్మ తన కొడుకు కోసం ఎంత ఆరాటపడిందో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు నాగార్జన గురించి తెలియనివారుండరు. అక్కినేని నాగేశ్వర్ రావు వారసుడైనా.. నాగార్జున తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. ఇక నాగార్జున మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటి. ఆమె ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కూతురు. ప్రముఖ నటుడు వెంకటేశ్ కు చెల్లెలు. అయితే నాగార్జున, లక్ష్మిలది అరేంజ్ మ్యారేజ్ అని అందరికీ తెలుసు. కానీ వీరిద్దరు కలిసి అమెరికాలో చదువుకునేటప్పుడే కలుసుకున్నారు. అక్కడ ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి: Child Artist అలనాటి బాల నటులు.. ఇప్పుడు హీరోయిన్లు.. వీరే..!

వివాహం జరిగిన తరువాత నాగార్జున-లక్ష్మికు నాగచైతన్య జన్మించారు. అయితే కొన్నాళ్ల తరువాత నాగార్జున-లక్ష్మిలు విడిపోయారు. వీరు విడిపోవడానికి నటి అమలనే కారణమని అంటారు. సినిమాల్లో వరుసగా నటిస్తున్న రోజుల్లో నాగార్జున కు మన్మథుడు అనే పేరు ఉండేది. అందుకు అనుగుణంగా ఆయన అమలతో ఎఫైర్ నడిపించారట. ఈ విషయం తెలిసిన లక్ష్మి నాగార్జునతో విడిపోవాలని నిర్ణయించుకుందట. దీంతో వీరు విడాకులు తీసుకున్నారు.

నాగార్జునతో విడిపోయిన తరువాత లక్ష్మి నాగచైతన్యతో కలిసి చెన్నైలో ఉండేది. 18 ఏళ్లు వచ్చేసరికి నాగచైతన్య తల్లి లక్ష్మితోనే ఉన్నాడు. ఈ సమయంలో లక్ష్మి నాగచైతన్యను చాలా క్రమ శిక్షణలో పెట్టింది. అంతేకాకుండా నాగచైతన్య సినిమాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడింది. ఎందుకంటే సినిమా నేపథ్యం ఉన్న లక్ష్మికి అక్కడికి వెళ్లి నాగార్జునలా మారుతాడేమోనన్న భయం ఉండేది. దీంతో నాగచైతన్య సైతం షూటింగ్ ల్లోకి వెళ్లేవారే గానీ సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఉండేది కాదు. అయితే నాగార్జున ఫోర్స్ తో నాగచైతన్య సినిమాల్లోకి వచ్చారు.
ఇక నాగచైతన్య సమంత విషయంలోనూ లక్ష్మి తగు జాగ్రత్తలు తీసుకుందట. నాగచైతన్య ప్రేమ విషయం తెలియగానే సమంతను అప్పుడప్పుడూ కలుస్తూ అమె గురించి తెలుసుకుంటూ ఉండేదట. ఆ తరువాతనే వీరి పెళ్లికి ఒప్పుకున్నట్లుసమాచారం. ఇలా నాగచైతన్య కోసం లక్ష్మి ఎప్పుుడూ పరితపిస్తూ ఉంటుందట. కాగా లక్ష్మి చెన్నైలోని ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.
ఇవి కూడా చదవండి: Prabhas: ప్రభాస్ సినిమా కోసం సూసైడ్ లేటెస్ట్ రాసిన అభిమాని.. కారణం?