Homeఎంటర్టైన్మెంట్Dhootha Season 2 Story: వెన్నులో వణుకు పుట్టించే రేంజ్ లో నాగ చైతన్య 'దూత...

Dhootha Season 2 Story: వెన్నులో వణుకు పుట్టించే రేంజ్ లో నాగ చైతన్య ‘దూత 2’..స్టోరీ లైన్ వింటే పిచ్చెక్కిపోతారు!

Dhootha Season 2 Story: వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎగురుకుంటూ వస్తున్న సమయంలో నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కి భారీ విజయాన్ని అందించిన వెబ్ సిరీస్ ‘దూత'(Dootha). మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్(Vikram K Kumar) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ హారర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. అప్పటి వరకు హారర్ జానర్ లో ఎన్నో సినిమాలు చూశాము, ఎన్నో వెబ్ సిరీస్ లు కూడా చూశాము, కానీ ఇలాంటి సరికొత్త ఐడియా తో ఒక వెబ్ సిరీస్ రావడం మాత్రం ఈమధ్య కాలం లో ‘దూత’ విషయం లోనే జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారుగా 8 నెలల పాటు టాప్ టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది అంటేనే ఏ రేంజ్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.

వెబ్ సిరీస్ గా కాకుండా, ఈ ఐడియా తో సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఉండుంటే నాగ చైతన్య కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ కి సీక్వెల్ ఉంటుందని ‘దూత’ క్లైమాక్స్ లోనే ఆడియన్స్ కి ఒక హింట్ ఇచ్చాడు డైరెక్టర్ విక్రమ్. ఇప్పుడు ఆ సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యిందట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా రీసెంట్ గానే మొదలు పెట్టారని, ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుండి నాగ చైతన్య ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ సీజన్ కథ విషయానికి వస్తే, మొదటి సీజన్ చివర్లో సాగర్(నాగ చైతన్య) తాను చేసిన తప్పులను పూర్తిగా తెలుసుకొని మారినప్పటికీ, ఆ శాపం ఇంకా వీడలేదని డైరెక్టర్ ఒక హింట్ ఇచ్చాడు. ఈసారి కథ కేవలం నాగ చైతన్య చుట్టూనే తిరగదు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్రాంతి షెనాయ్ (పార్వతి తిరవోతు) చుట్టూ కూడా ఈ కథ తిరగనుంది.

ఆమె ఇన్వెస్టిగేషన్ లో ఎదురుకునే మిస్టరీలను కూడా ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారు. ఇది ఇలా ఉండగా మొదటి సీజన్ ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శరత్ మరార్ నిర్మించాడు. కానీ ఇప్పుడు రెండవ సీజన్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించబోతుందట. నాగ చైతన్య ఈసారి సొంత బ్యానర్ లో పనిచేయబోతున్నాడు అన్నమాట. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దర్శకత్వంలో నాగ చైతన్య ‘వృష కర్మ’ అనే మిస్టిక్ జానర్ సినిమాని చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం విడుదల కానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version