Dhoni and Prabhas : క్రికెట్ అభిమానులకు పండుగ లాంటి IPL సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రతీ ఏటా ఈ సీజన్ ప్రారంభం అయ్యే ముందు సోషల్ మీడియా లో కళకళలాడిపోతూ ఉంటుంది. అభిమానుల కోలాహలం తో అద్భుతమైన ఎడిటింగ్ వీడియోస్ తో సోషల్ మీడియా మొత్తం నిండిపోతుంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH), ముంబై ఇండియన్స్(MI) టీమ్స్ కి అభిమానులు అసంఖ్యాకంగా ఉంటారు. సోషల్ మీడియా లో అయితే హీరోల విషయంలో గ్రూప్స్ గా విడిపోయే అభిమానులు, ఐపీఎల్ వచ్చినప్పుడు మాత్రం ఏకం అయిపోతుంటారు. రీసెంట్ గా ఒక ప్రభాస్(Rebelstar Prabhas) అభిమాని మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni), ప్రభాస్ ని కలిపి ఒక ‘సలార్'(Salaar Movie) మూవీ లోని ఒక సన్నివేశాన్ని తీసుకొని ఎడిట్ చేసాడు. దీనికి ఫ్యాన్స్ నుండి రెస్పాన్స్ మామూలు రేంజ్ లో రాలేదు. ధోని, ప్రభాస్ మ్యూచువల్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది.
Also Read : ప్రభాస్ ఎవరో తెలియదు అన్న ఆ స్టార్ హీరో..కట్ చేస్తే ప్రభాస్ సినిమాలోనే విలన్ గా చేస్తున్నాడు…
ఈ వీడియో ని చూసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ చాలానే చేసారు. పవన్ కళ్యాణ్, ధోని మ్యూచువల్ అభిమానులు, పవన్ కళ్యాణ్, కోహ్లీ మ్యూచువల్ అభిమానులు, ఇలా అందరి హీరోల అభిమానులు మ్యూచువల్ ఫ్యానిజం చూపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు కోల్ కత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మధ్య మొదటి IPL మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత మరుసటి రోజున రెండు మ్యాచులు జరగనున్నాయి. ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్, ఇది మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు జరగనుంది.
అదే విధంగా రెండవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతానికి అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ముంబై ఇండియన్స్ కి ఉందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ సీజన్ ఎంత రసవత్తరంగా ఉండబోతుంది?, ఎవరు గెలవబోతున్నారు అనేది.
Also Read : మీరు వర్జినా?.. ఐ యామ్ నాట్.. ప్రభాస్ హీరోయిన్ దిమ్మ తిరిగే ఆన్సర్! ఏమైంది అంటే?
Game of Beasts !!#Dhoni #Prabhas pic.twitter.com/ULRdLsLkhA
— Murphy (@dhaProblematic) March 16, 2025