Heroine : ఈ పాప.. ఇప్పుడు సినిమాల్లో కనిపిస్తూ కుర్రాళ్లను షేక్ చేస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..

అయితే తనకు సంబంధించిన చిన్న నాటి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సందర్భంగా శ్రద్ధాదాస్ గురించి రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Written By: NARESH, Updated On : September 25, 2023 4:38 pm
Follow us on

Heroine : సినిమాల్లో రాణించాలంటే టాలెంట్ ఉండాలంటారు. కానీ ఆవగింజంతైనా అదృష్టం ఉండాలని మరికొందరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే కొందరు భామలకు అందం, అభినయంతో పాటు నటనలో ప్రావీణ్యం ఉంటుంది. కానీ స్టార్ కాలేకపోతారు. వారికి తగిన పాత్రలు లేకపోవడంతో మిగతా హీరోయిన్లతో పోటీ పడలేక పోతారు. తెలుగు సినిమాల్లో అలాంటివారు చాలా మంది ఎంట్రీ ఇచ్చి చివరికి సైడ్ హీరోయిన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోయారు. అయితే ఓ బ్యూటీని చూస్తే కుర్రకారుకు షేక్ అవుతుంది. ఇక అమె అందాల ఆరబోతను చూసి చూపు తిప్పుకోలేరు. కానీ ఈ భామ స్టార్ కాలేకపోయింది. అయితే ఈమెకు సంబంధించిన చైల్డ్ హుడ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో అలరిస్తోంది. ఇంతకీ ఎవరా భామ?

హీరోయిన్ కావాలని వచ్చిన ఈ సుందరి.. ఛాన్స్ లు దక్కించుకోలేకపోయింది. చివరికి రెండో హీరోయిన్ గా నటించింది. వేరియేషన్ నటి అనిపించుకోవడానికి డాన్ లేడిగానూ కనిపించింది. అయినా ఈమెకు అవకాశాలు రాలేకపోయాయి. దీంతో సాంప్రదాయ గోడలు బద్దలు కొట్టి అందాల వరద పారించింది. బికినీ నుంచి పొట్టి డ్రెస్సులు వేస్తూ కుర్రాళ్లను బాగా అలరిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హీటెక్కిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫొటో ఆకట్టుకుంటోంది. ఆమె ఎవరో కాదు శ్రద్ధాదాస్.

శ్రద్దాదాస్ హీరోయిన్ రేంజ్ లో అందంతో ఆకట్టుకుంటుంది. కానీ అలాంటి అవకాశాలు రావడం లేదు. శ్రద్ధాదాస్1987 మార్చిన 4న ముంబైలో జన్మించింది. అక్కడే పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా తీసుకుంది. ఆ తరువాత సినిమాలపై ఆసక్తి పెంచుకొని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చిన శ్రద్ధాదాస్ అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సిద్ధూ ఫ్రం సికాకుళం’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రెండో హీరోయిన్ అయినా శ్రద్ధ నటనకు మార్కులు పడ్డాయి. ఆ తరువాత జగపతి బాబుతో కలిసి ‘అధినేత’ లో మెయిన్ హీరోయిన్ గా నటించింది.

అయితే ఆ తరువాత అల్లు అర్జున్ ‘ఆర్య 2’ లో డిఫరెంట్ రోల్ లో నటించింది. ఇలా వరుసగా పలు సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్నా మెయిన్ హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ ‘చాయ్ షాయ్ బిస్కెట్స్’, లక్కీ కబూతర్, దిల్ తో బచ్చా హైజీ వంటి సినిమాల్లో నటించింది. ఆ తరువాత కన్నడలో హోస ప్రేమ పురాణ, మలయాళంలో డ్రాకులా లో నటించింది.

ప్రస్తుతం వెబ్ సిరీసుల్లో నటిస్తూ.. మరోవైపు ఢీ షో తో అలరిస్తున్న శ్రద్ధాదాస్ సోషల్ మీడియాలో తన పర్సనల్ ఫొటోలను పెట్టి అలరిస్తూ ఉంటుంది. సినిమాల్లో హాట్ గా కనిపించే అవకాశం లేకపోయినా వెకేషన్ వెళ్లినప్పుడు బికినీ షో చేస్తూ అలరిస్తోంది. అయితే తనకు సంబంధించిన చిన్న నాటి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సందర్భంగా శ్రద్ధాదాస్ గురించి రకరకాల కామెంట్లు పెడుతున్నారు.