https://oktelugu.com/

Dhee Choreographer Chaitanya Death : ఆత్మహత్య చేసుకునే ముందు ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మాట్లాడిన ఈ మాటలు వింటే ఏడుపు ఆపుకోలేరు

ఎవ్వరూ మితిమీరే విధంగా అప్పులు చెయ్యకండి, చేస్తే ఇలా నాలాగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, చాలా ట్రై చేశాను , కానీ అంత అప్పు కట్టడం నా వల్ల కావడం లేదు, అందుకే ధైర్యం చేసుకొని ఈ పని చేస్తున్నాను.

Written By:
  • Vicky
  • , Updated On : May 1, 2023 / 07:16 AM IST
    Follow us on

    Dhee Choreographer Chaitanya Death : సామాన్యులకు మాత్రమే కాదు, సినీ సెలెబ్రెటీలకు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు కూడా మనుషులే అనే విషయం గ్రహించాలి. ఆర్ధిక సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ని మనం చూసాము, ఇప్పుడు ఆ కోవలోకి చెందిన వాడే ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.

    ఢీ ప్రోగ్రాం లో మంచి డ్యాన్స్ మాస్టర్ గా కొనసాగిన చైతన్య నిన్న ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నెల్లూరు లో ఆయన ఈ చర్యకి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన వదిలిన ఒక వీడియో బైట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ముందుగా తన తల్లితండ్రులు ,మిత్రులు మరియు తన కో ఢీ కంటెస్టెంట్స్ కి, తన తోటి కొరియోగ్రాఫర్స్ కి  క్షమాపణలు చెప్పుకున్నాడు,ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయి.

    ఆయన మాట్లాడుతూ ‘ ఎవ్వరూ మితిమీరే విధంగా అప్పులు చెయ్యకండి, చేస్తే ఇలా నాలాగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, చాలా ట్రై చేశాను , కానీ అంత అప్పు కట్టడం నా వల్ల కావడం లేదు, అందుకే ధైర్యం చేసుకొని ఈ పని చేస్తున్నాను. నా వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, అది నాకు నచ్చడం లేదు, దయచేసి నన్ను క్షమించండి. ఇదే నా ఆఖరి రోజు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు కన్నీళ్లు రప్పిస్తున్నాయి, ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూడవచ్చు.

    చైతన్య ఢీ ఫ్యామిలీ లో ఉన్నాడు కాబట్టి తనకి ఉన్న ఆర్ధిక కష్టాలను ఢీ షో లో ఉన్న వాళ్లందరికీ చెప్పుకొని ఉంటే, ప్రతీ ఒక్కరు ఒక చెయ్యి వేసి చైతన్య ని ఈ కష్టాల నుండి కాపాడేవారు. కానీ ఆయన ఆ ప్రయత్నం చేసాడో లేదో తెలియదు కానీ , ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసి కూడా ఎవరూ సహాయం చెయ్యడానికి ముందుకు రాలేదంటే మాత్రం నిజంగా మానవత్వం లేదనే చెప్పాలి.