Anchor Pradeep- Prasad: యాంకర్ ప్రదీప్ స్టార్ యాంకర్ గా తిరుగులేని ఇమేజ్ కలిగి ఉన్నాడు. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ దే హవా. ఇప్పుడిప్పుడు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్ళు యాంకర్స్ గా మారి ప్రదీప్ కి పోటీ ఇస్తున్నారు. ఓ పదేళ్లుగా ప్రదీప్ తిరుగులేని యాంకర్ గా బుల్లితెరను శాసిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సంపాదన కూడా కోట్లలో ఉంది. ఈక్రమంలో అనేక ఆరోపణలు ప్రదీప్ ఎదుర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రదీప్ వ్యవహారం పెద్ద రచ్చ అయ్యింది. పోలీసులు ఆయన్ని కౌన్సిలింగ్ కి హాజరు కావాలని ఇబ్బంది పెట్టారు. అనంతరం తనదే తప్పంటూ ప్రదీప్ వీడియో విడుదల చేశారు. తనలా ఎవరూ తాగి డ్రైవింగ్ చేయవద్దని కోరుకున్నారు.

అలాగే ప్రదీప్ కొన్ని లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. యువతులు కొందరు ప్రదీప్ తమను శారీరకంగా వాడుకున్నట్లు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఆరోపణల్లో నిజం లేదని తర్వాత తేలింది. ప్రదీప్ పై ఎలాంటి ఆరోపణలు వచ్చినా తన బుల్లితెర మిత్రులు అండగా నిలిచేవారు. ప్రదీప్ ని దగ్గరగా చూసిన వారిగా తను అలాంటి వ్యక్తి కాదని మద్దతు తెలిపేవారు.
నిజానికి ప్రదీప్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. సంపాదనలో అనేక దానధర్మాలు చేస్తారు. తన పేరిట ఛారిటీలు నిర్వహిస్తున్నారు. తాజా సంఘటనతో ప్రదీప్ మంచితనం మరోసారి బయటపడింది. ఢీ రియాలిటీ షోకి చాలా కాలంగా ప్రదీప్ యాంకర్ గా ఉంటున్నారు. ప్రస్తుతం ఢీ 14 నడుస్తుంది. గతంలో ఢీ కంటెస్టెంట్ గా ఉన్న ప్రసాద్ డాన్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అతని కాలు విరిగింది.

కోలుకున్న డాన్సర్ ప్రసాద్ ఢీ 14 లేటెస్ట్ ఎపిసోడ్ కి రావడం జరిగింది. ఈ సందర్భంగా కాలు విరిగిన సమయంలో ప్రదీప్ చేసిన సాయం గురించి వెల్లడించారు. నా కాలు విరిగి హాస్పిటల్ లో ఉన్నప్పుడు చాలా మంది సహాయం చేశారు. అయినా వైద్యానికి డబ్బులు సరిపోలేదు. ఆ సమయంలో సుధీర్ అన్నకు ఫోన్ చేశాను. వెంటనే అడిగిన డబ్బులు పంపి సకాలంలో ఆదుకున్నారు. అది ప్రదీప్ అన్న ఒరిజినల్ క్యారెక్టర్ అంటూ గొప్పగా చెప్పాడు. ఎంత సంపాదన ఉన్నా ఎదుటివారికి సహాయం చేయాలనే గుణం కొందరికే ఉంటుంది.
Also Read: Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ అసలు పేరు తెలుసా…? తెలిస్తే పడి పడి నవ్వుతారు!
[…] […]