Rajinikanth Acting Career: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు రజినీకాంత్ (Rajini kanth)… ఆయన కెరియర్ లో ఎన్నో సినిమాలను చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ లుగా నిలపాడు. ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను సైతం తన వీరాభిమానులుగా మార్చుకోవడంలో ఆయన కీలక పాత్ర వహించాడు…ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న కూలీ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంలో ఈ సినిమా విషయంలో ఆయన ఇప్పటికే చాలా క్లారిటీగా ఉన్నాడు…ఇక ఈ తన హీరోగా వస్తున్న కూలీ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. అనే కాన్ఫిడెంట్ తో రజినీకాంత్ ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…ఈ సినిమా మొత్తంలో ఆయన చాలా హైలెట్ గా నిలువబోతున్నాడట. ఈ సినిమాలో ఎంతమంది నటులు ఉన్నప్పటికి ఆయన స్థానం ప్రత్యేకంగా ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రజనీకాంత్ చేస్తున్న సినిమాల్లో ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది. అందుకే ఆయన మంచి సబ్జెక్టులను ఎంచుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
Also Read: ‘ఎస్ఎస్ఎంబి 29’ తర్వాత మహేష్ ఆ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు..?
అయితే 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా రజనీకాంత్ మెయిన్ హీరోగా సినిమాలు చేస్తుంటే దానిని చూసి ప్రేక్షకులు ఆనందిస్తున్నారు అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక రజనీకాంత్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రతి ఒక్కరు విజిల్స్ తో సందడి చేస్తూ ఉంటారు.
మరి అలాంటి రజనీకాంత్ ఇకమీదట హీరోగా సినిమాలు చేసే కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తే మంచిదని చాలా మంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సినిమాలు చేయడం మంచిదే కానీ ఆయన ఈ ఏజ్ లో రిస్కీ ఫైట్స్ ని చేస్తూ ఏదైనా జరగకూడనిది జరిగితే అతనికి చాలా ఇబ్బంది అవుతోంది.
Also Read: పూరి – విజయ్ సేతుపతి మూవీ లో గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో…
దానివల్ల ఆయన హీరోగా కంటే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తే మంచిదని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రజనీకాంత్ అభిమానులు మాత్రం ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు సినిమాని సూపర్ సక్సెస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటూ ఆయన ప్రతి సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ప్రూవ్ చేస్తూనే వస్తున్నారు…