Dharmavarapu Subramanyam: నవ్వుల మాస్టారు జయంతి నేడు !

Dharmavarapu Subramanyam: ఆయన మాట విరుపు గొప్ప నవ్వుల హరివిల్లు.. ఆయన టైమింగ్ గొప్ప కామెడీకి కేరాఫ్ అడ్రస్.. ఆయనే వెండితెర నవ్వుల మాస్టర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయన అమాయకమైన మొహం తో కన్నింగ్ లుక్ ఇచ్చి.. ‘అబ్బా.. మాక్కూడా తెలుసు బాబూ..’ అంటూ విరిచే మాటల విరుపులు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. పాత్ర ఏదైనా సరే.. తన వెటకారంతో తన స్పీడ్ మేనరిజంతో ఆకట్టుకోవడం ఆయనకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకత. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనగానే […]

Written By: admin, Updated On : September 20, 2021 2:51 pm
Follow us on

Dharmavarapu Subramanyam: ఆయన మాట విరుపు గొప్ప నవ్వుల హరివిల్లు.. ఆయన టైమింగ్ గొప్ప కామెడీకి కేరాఫ్ అడ్రస్.. ఆయనే వెండితెర నవ్వుల మాస్టర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయన అమాయకమైన మొహం తో కన్నింగ్ లుక్ ఇచ్చి.. ‘అబ్బా.. మాక్కూడా తెలుసు బాబూ..’ అంటూ విరిచే మాటల విరుపులు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి.

పాత్ర ఏదైనా సరే.. తన వెటకారంతో తన స్పీడ్ మేనరిజంతో ఆకట్టుకోవడం ఆయనకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకత. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనగానే లెక్చరర్‌ పాత్రలు గుర్తుకువస్తాయి. ఆ పాత్రలకు ఆయన అంత గొప్పగా జీవం పోశారు. ఈ రోజు ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి.

ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను విశేషాలను చూద్దాం. 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో పుట్టారు. ఒంగోలులోని సీఎస్‌ఆర్ కళాశాలలో పీయూసీ వరకు చదివారు. ఆ తర్వాత కొన్నాళ్ళు పాటు విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గా కూడా జాబ్ చేశారు.

అయితే జాబ్ పై ఆసక్తి లేకపోవడంతో నాటకాల్లోకి వచ్చారు. ఆ నాటకాల నుంచి కామెడీ సీరియల్‌ ఆనందో బ్రహ్మలో నటించారు. పైగా ఆ సీరియల్ కి ఆయనే రచయిత, అలాగే ఆయనే దర్శకుడు కూడా. ఆ తర్వాత కాలంలో జంధ్యాల సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఆ తర్వాత ‘బావా బావా పన్నీరు, స్వాతి కిరణం, పరుగో పరుగు, ష్‌ గప్‌చుప్‌, ఓహో నా పెళ్లంట, నువ్వే కావాలి, ఆనందం’ ఇలా అనేక సినిమాల్లో ఆయన ఎన్నో హాస్య పాత్రలు పోషించి మన హృదయాలలో శాశ్వతంగా స్థానాన్ని సంపాధించుకున్నారు.