Adivi Sesh: డెంగ్యూ ఫీవర్ తో ఆసుపత్రిలో చేరిన హీరో అడివి శేష్

రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు వణుకు పట్టిస్తున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు కూడా డెంగ్యూ బారిన పడుతున్నారు. తాజాగా యువ హీరో అడివి శేష్ డెంగ్యూ బారిన పడ్డినట్లు తెలుస్తోంది. గత వారం ప్లేట్ లెట్స్ సడెన్ గా పడిపోవడంతో ఈ నెల 18న ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం అడవిశేష్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. శేష్ అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.  […]

Written By: NARESH, Updated On : September 20, 2021 4:34 pm
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు వణుకు పట్టిస్తున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు కూడా డెంగ్యూ బారిన పడుతున్నారు. తాజాగా యువ హీరో అడివి శేష్ డెంగ్యూ బారిన పడ్డినట్లు తెలుస్తోంది. గత వారం ప్లేట్ లెట్స్ సడెన్ గా పడిపోవడంతో ఈ నెల 18న ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం.

ప్రస్తుతం అడవిశేష్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. శేష్ అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.  ప్రత్యేక వైద్య బృందం అడివి శేష్ కి వైద్యం అందిస్తుండగా కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన హెల్త్ కండీషన్ గురించి అధికారికంగా వెల్లడించనున్నారు. మరోవైపు అడవి శేష్ ఆరోగ్యం విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ప్రస్తుతం అడివి శేష్ 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ అనే సినిమా చేస్తున్నారు. శశికిరణ తిక్క దర్శకత్వంలో మహేశ్ బాబు జీఎంబీ ఎంటర్ టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోని పిక్షర్స్ ఫిల్మ్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఇందులో శోభితా దూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు.

ఒక స్టార్ హీరో అయ్యిండి ఒక దోమతో సోకే ‘డెంగ్యూ’ బారిన పడడం సంచలనమే.. అత్యంత సెక్యూరిటీ గల జీవితంలో బతికే హీరో ఇలా అనారోగ్యానికి గురికావడం శోచనీయమే.. అయితే ప్రస్తుతం ‘గూఢచారి2’, ‘మేజర్’ షూటింగ్ ల కోసం బయట ఉన్న యంగ్ హీరో అడవి శేష్ ఈ డెంగ్యూ బారినపడ్డట్టు తెలుస్తోంది.