Tere Ishk Mein Movie Collections: తమిళ హీరో ధనుష్(Dhanush) కేవలం ఒక్క తమిళ భాషకు చెందిన హీరో కాదు, పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈయన పాన్ ఇండియా సినిమాలు చేయడు. కానీ పక్క ఇండిస్టీస్ లోకి వెళ్లి, అక్కడి డైరెక్టర్స్ తో, నటీనటులతో కలిసి సినిమాలు చేస్తాడు. అలా మన తెలుగు లో కూడా ‘సార్’, ‘కుబేర’ వంటి చిత్రాలు చేసి భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. ఇక బాలీవుడ్ లో ఎప్పుడో 12 ఏళ్ళ క్రితమే ‘రంజానా’ అనే చిత్రం తో సూపర్ హిట్ ని అందుకున్న ధనుష్, రీసెంట్ గానే ‘తేరే ఇష్క్ మెయిన్'(Tere Ishq Mein) చిత్రం తో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈమధ్య కాలంలో విడుదలైన లవ్ స్టోరీస్ లలో ది బెస్ట్ అని అనిపించుకుంది.
12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి దాదాపుగా 103 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది బాలీవుడ్ లో మొట్టమొదటి ధనుష్ 100 కోట్ల నెట్ సినిమా అట. అదే విధంగా హీరోయిన్ కృతి సనన్ కి ఇది నాల్గవ వంద కోట్ల సినిమా అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుండి వచ్చిన వసూళ్లు మాత్రమే. ఓవర్సీస్ లో పాతిక కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి గ్రాస్ రూపం లో చూస్తే 150 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉండడం తో, ఫుల్ రన్ లో 170 నుండి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గానే ‘దురంధర్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమా ప్రభావం ‘తేరే ఇష్క్ మెయిన్’ మీద చాలా బలంగానే పడిందట, ముఖ్యంగా మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ లో, కానీ ఉన్నంత లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.