Dhanush : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి సందర్భంలోనే ధనుష్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఇప్పటికే ఈయన తెలుగు సినిమా దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. తద్వారా ఆయన మరిన్ని తెలుగు సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి….
శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వంలో ధనుష్ (Dhanush) హీరోగా వస్తున్న సినిమా ‘కుబేర’ (Kubhera) ఈ సినిమాతో ధనుష్ భారీ విజయాన్ని సాధిస్తాడు అంటూ మంచి కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలు నటిస్తున్నాడట. మరి తను ఎలాంటి పాత్రనైనా పోషించడానికి సిద్ధంగా ఉంటాడు. అందువల్లే వైవిధ్యమైన పాత్రలు మొత్తం అతన్ని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వస్తుంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తెలుగులో ఆయన చేసిన సార్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే తెలుగు డైరెక్టర్ లతో ఆయనకు చాలా మంచి ర్యాపో అయితే పెరుగుతుంది. తద్వారా మరిన్ని తెలుగు సినిమాలు చేయడానికి ఆయనకి అవకాశం రావడమే కాకుండా కొత్త దర్శకులు కూడా అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఇక్కడ మంచి క్రేజ్ ను సంపాదించుకుంటే హీరో నాని (Nani) కి కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే మీడియం రేంజ్ హీరోల్లో నాని ముందు వరుసలో ఉన్నాడు. ఆయన చేసే వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ధనుష్ వచ్చి ఇక్కడ తన విజయకేతనాన్ని ఎగరవేస్తే నానిని పట్టించుకునే దర్శకుల సంఖ్య కొంత వరకు తగ్గిపోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ధనుష్ డిఫరెంట్ పాత్రలను పోషించడంలో ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు.
కాబట్టి ఆయనతో సినిమా చేస్తే పాన్ ఇండియా మార్కెట్ కూడా భారీగా వర్కౌట్ అవుతుంది. తద్వారా ఆయన చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి కథలన్నీ ధనుష్ దగ్గరికి తీసుకెళ్లే అవకాశమైతే ఉంటుంది.
నాని లాంటి స్టార్ హీరో ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
లేకపోతే ధనుష్ రూపంలో తనకు భారీ ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక అలాగే దుల్కర్ సల్మాన్ (Dulkar Salman) లాంటి హీరో సైతం ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు.
ఇప్పటికే ఆయన తెలుగులో సీతారామం(Seetha Ramam), లక్కీ భాస్కర్(Lucky Bhaskar) లాంటి రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించారు. కాబట్టి ఈయన నుంచి కూడా నానికి విపరీతమైన పోటీ ఎదురవుతుంది. మరి వీళ్ళ అందరిని తట్టుకొని నాని నిలబడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…