
Dhanush Sir Movie First Review: తమిళ స్టార్ హీరోలు ఈమధ్య వరుసగా తెలుగు సినిమా డైరెక్టర్స్ పై మక్కువ పెంచుకున్నారు, రీసెంట్ గానే తమిళనాడు లో సూపర్ స్టార్ రేంజ్ లో కొనసాగుతున్న విజయ్ తెలుగు డైరెక్టర్ వంశి పైడిపల్లి తో ‘వారసుడు’ అనే సినిమా చేసిన సంగతి తెల్సిందే.దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇటు తెలుగులోనూ అటు తమిళం లోను దుమ్ము లేపేసింది.
Also Read: Naveen Chandra: తండ్రి కాబోతున్న మరో తెలుగు హీరో
ఇప్పుడు మరో తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగు డైరెక్టర్ అయినా వెంకీ అట్లూరి తో ‘సార్’ అనే సినిమా చేసాడు, తమిళం లో ఈ చిత్రం ‘వాతి’ పేరుతో విడుదల కానుంది.ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళీ భామ సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్ గా నటించింది.
ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.చదువు గొప్పతనం గురించి చాటిచెప్పే విధంగా ఈ సినిమాని వెంకీ అట్లూరి తీర్చిదిద్దాడట.ఎంటర్టైన్మెంట్ తో పాటుగా మంచి సందేశం తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ చాలా చక్కగా మలిచాడట.రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ జారీ చేసారు.

ధనుష్ ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయమని, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సరిగ్గా బ్యాలన్స్ అయ్యాయని, ధనుష్ ఈ సినిమాతో తెలుగు లో కూడా ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పర్చుకుంటాడంటూ సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసలతో ముంచెత్తారట..మరో మూడు రోజుల్లో మన ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్ టాక్ ని మ్యాచ్ చేస్తుందో లేదో చూడాలి.
Also Read: Ram Charan: రామ్ చరణ్ కి ఊహించని షాక్ ఇచ్చిన అభిమాని..వైరల్ అవుతున్న వీడియో