
Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడిపోయాక సినిమాల మీద దూకుడు పెంచింది. ఇటీవల సినిమాలు, యాడ్లు, షూటింగుల్లో బిజీగా గడుపుతోంది. కానీ ఇటీవల ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో ఆమె ఆరోగ్యంపై కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆమెకు వచ్చిన వ్యాధితో ఇదివరకే చికిత్స తీసుకున్నా ఇంకా తగ్గడం లేదనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడులోని పళని మురున్ ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. కొండ మీద ఉన్న దేవుడి వద్దకు 600 మెట్ల వరకు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించింది.
ఇటీవల ఆరోగ్యం నుంచి కోలుకోవడంతోనే మొక్కులు చెల్లించిందని సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. చైతన్యతో విడాకుల తరువాత ఆధ్యాత్మికతకు మొగ్గు చూపుతోంది. దేవాలయాలు తిరుగుతోంది. మొక్కులు చెల్లించుకుంటోంది. ఆరోగ్యం బాగుండాలని అన్ని దేవుళ్లను ప్రార్థిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడినట్లు సమాచారం.
దీనికి చికిత్స కూడా తీసుకుంటోంది. మూడు రోజులు ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకుంది. కొన్ని నెలలు ఫారిన్ లో ఉండి విశ్రాంతి తీసుకుని ఇటీవల ఇక్కడకు వచ్చి పూజలు చేసింది. దీంతో భక్తి భావం పెరుగుతోంది. ఈ మేరకే తమిళనాడులోని పళని మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. మెట్టు మెట్టుకు హారతి వెలిగిస్తూ దేవుడిని వేడుకుంది. సమంత పూర్తిగా కోలుకున్నాకే పూజలు చేసిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయట హల్ చల్ చేస్తున్నాయి.

శరీరంలో ఇమ్యూనిటీ పవర్ సమర్థంగా పనిచేయకపోవడంతో ఇతర వ్యాధులు సంక్రమిస్తాయి. ఇందులో భాగంగా ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదముంటుంది. దీనికి ఐవీఐజీ థెరపీ పనిచేస్తుంది. దీనికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. దీని నుంచి బయటపడటానికే చికిత్స తీసుకుంటోంది. యశోద సినిమాతో అలరించిన సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో మళ్లీ సందడి చేయనుంది. మెథలాజిక్ మూవీగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. కానీ కొన్ని కారణాలతో ఏప్రిల్ 14న విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఈ సినిమాలో శకుంతలగా సమంత నటన మరింత అబ్బురపరచనుందని సమాచారం. దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించాడు. సమంత కెరీర్ లోనే తొలి పౌరాణిక పాత్రలో కనిపించనుంది. ఇందులో ప్రకాశ్ రాజ్, గౌతమి, మధుబాల, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా తదితరులు నటించారు. ఈ సినిమాతో సమంత మళ్లీ ఫామ్ లోకి రానుందని చెబుతున్నారు.