Dhanush: పెళ్లైన హీరోయిన్ తో ధనుష్ ప్రేమాయణం ?

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనుష్ ఇద్దరు పిల్లలను కన్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో కానీ గత ఏడాది వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూసింది.

Written By: Shiva, Updated On : September 11, 2023 4:16 pm

Dhanush

Follow us on

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళనాడులోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న నటుడు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకునే ధనుష్ కేవలం ఇండియన్ సినిమాస్ లోనే కాకుండా ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. తాజాగా ఈ నటుడు గురించి సోషల్ మీడియా లో ఒక వార్త హల్చల్ చేస్తుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనుష్ ఇద్దరు పిల్లలను కన్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో కానీ గత ఏడాది వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూసింది. దీంతో రజనీకాంత్ కు దగ్గరైన కొందరు పెద్దలు వీళ్ళను కలిపి ఉంచే ప్రయత్నాలు చేసిన కానీ అవేమి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది.

దీనితో సహజంగా అటు ధనుష్ కావచ్చు, ఇటు ఐశ్వర్య కావచ్చు ఎవరితో అయిన సన్నిహితంగా ఉండే వాళ్ళ మీద రూమర్స్ రావడం సహజం. తాజాగా ధనుష్ మీద ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. పెళ్లైన హీరోయిన్ తో అతను ప్రేమలో మునిగిపోయాడని ఆ వార్తల సారాంశం. ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ. అయితే నిజానికి ధనుష్ మరియు కియారా మధ్య అలాంటిదేమీ లేదని తెలుస్తుంది.

ఈ ఇద్దరు కలిసి జంటగా ఒక సినిమాలో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్ లో తేరే ఇష్క్ మే అనే సినిమా వస్తుంది. అలాగే ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ట్టు తెలుస్తోంది. ఇందులో వీళ్లిద్దరు ప్రేమికులుగా కనిపిస్తున్నారు. దాన్ని పట్టుకొని ధనుష్ పెళ్లైన హీరోయిన్ గా ప్రేమాయణం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక ధనుష్ తమిళ్, తెలుగు, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో నటిస్తున్నాడు. రీసెంట్ గా తెలుగులో “సర్” అనే మూవీ లో నటించి హిట్ కొట్టాడు. మరోపక్క శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు