Raayan Movie Review: ‘రాయన్ ‘ ఫుల్ మూవీ రివ్యూ…

ధనుష్ స్వతహాగా డైరెక్షన్ చేసి నటించిన 'రాయన్ ' సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ఎలా ఉంది. సక్సెస్ సాధించిందా లేదా డైరెక్టర్ గా ధనుష్ సక్సెస్ ని అందుకున్నాడా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : July 26, 2024 11:17 am

Raayan Movie Review

Follow us on

Raayan Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని సూపర్ సక్సెస్ లను కొట్టే హీరోలలో ధనుష్ ఒకరు. ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక చిన్న ప్లాట్ పాయింట్ తో తెరకెక్కి మంచి విజయాలను సాధించినవే కావడం విశేషం. ఇక తను ఏ పాత్రలో అయినా సరే పూర్తి ఎఫర్ట్ పెట్టి నటిస్తూ ఉంటాడు. ఇక తెలుగు,తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులకు తన నటన ప్రతిభను చూపిస్తూ సక్సెస్ అవుతూ వస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో తనే స్వతహాగా డైరెక్షన్ చేసి నటించిన ‘రాయన్ ‘ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ఎలా ఉంది. సక్సెస్ సాధించిందా లేదా డైరెక్టర్ గా ధనుష్ సక్సెస్ ని అందుకున్నాడా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రాయన్ (ధనుష్) నా అనుకున్న మనుషుల కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే రాయన్ మనుషులకి అక్కడున్న లోకల్ రౌడీలకి మధ్య తీవ్రమైన గొడవ అయితే జరుగుతుంది. ఇక ఆ గొడవలోకి రాయన్ ఇన్వాల్వ్ అయి అక్కడ ఉన్న తన వాళ్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆ క్రమంలోనే మిగతా రాజకీయ నాయకులు ఆ గొడవలో ఇన్వాల్వ్ అవుతారు. మరి అక్కడి నుంచి ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ధనుష్ తన 50వ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడమే కాకుండా తనే డైరెక్షన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. దర్శకుడిగా ధనుష్ తన వంతు ప్రయత్నం అయితే చేశాడు. ఇక మొదట ఈ సినిమా స్టార్ట్ చేసిన విధానం కొంతవరకు బోరింగ్ గా అనిపించినప్పటికీ మధ్యలో మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ తెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో భాగంగానే సినిమా ఇంటర్ వెల్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ఇక సెకండాఫ్ లో వచ్చే కొన్ని కోర్ ఎమోషన్ సీన్స్ ని ధనుష్ డైరెక్టర్ గా బాగా హ్యాండిల్ చేశాడు. నిజానికి ఫస్ట్ ఆఫ్ తో పోల్చుకుంటే సెకండ్ ఆఫ్ చాలా బాగుంది.

ఇక ధనుష్ కూడా డైరెక్షన్ పరంగా కొంత వరకు మెప్పించాడనే చెప్పాలి. మొదట చూపించిన 15 నిమిషాల స్టోరీని చివరిలో ఇంటర్ లింక్ చేసిన విధానం ఆ స్క్రీన్ ప్లే రాసుకున్న పద్ధతి కూడా చాలా బాగుంది… డైరెక్షన్ పరంగా ధనుష్ కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ ఆయనకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం అనేది స్క్రీన్ మీద మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక మొదటి సినిమా అయిన కూడా తన పూర్తి ఎఫర్ట్ ను పెట్టి డైరెక్షన్ చేసిన విధానం అయితే అందరికీ నచ్చుతుంది. పేపర్ మీద ఉన్న ప్రతి సీన్ ని తను ఓన్ చేసుకొని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. మధ్యలో కొన్ని సీన్లు బోర్ కొట్టించినట్టు అనిపించినప్పటికీ తన మేకింగ్ తో ధనుష్ వాటిని ఓవర్ కమ్ చేస్తూ వచ్చాడు. మొత్తానికైతే ధనుష్ అటు నటుడిగా, ఇటు దర్శకుడిగా రెండు కీలక బాధ్యతలను వ్యవహరిస్తూనే రెండింటిలో చాలావరకు సక్సెస్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాడు. ఇక అందులో దర్శకుడిని పక్కన పెడితే నటుడిగా మాత్రం ధనుష్ సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి… ఇక తన 50వ సినిమాని వేరే దర్శకుడితో తీయిస్తే అయిపోయేది. కానీ ధనుష్ రిస్క్ చేసి మరి ఎందుకు తీశాడు అనే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ ధనుష్ మాత్రం తన స్టామినా ఏంటో తెలుసుకొని దాని మీద ఒక కథ రాసుకొని డైరెక్షన్ చేసిన విధానం అయితే అందరికీ చాలావరకు నచ్చింది…

మొత్తానికైతే ధనుష్ డైరెక్టర్ గా తన మొదటి ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ అయితే చాలా వరస్ట్ గా ఉందనే చెప్పాలి. ఈ సినిమా కి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించినప్పటికీ ఈ సినిమాలో ఒక్క సాంగ్ కూడా బాగాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే మరి దారుణం గా ఉంది. ఇక సినిమాలో పాటలు వచ్చినప్పుడైతే పాటలు ఎందుకు వస్తున్నాయా అంటూ సినిమా చూసే ప్రతి ఒక్కరూ చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో ఏఆర్ రెహమాన్ కూడా రాయన్ సినిమా కి తన మ్యూజిక్ తో ఒక భారీ దెబ్బ కొట్టాడనే చెప్పాలి… ఇక అనవసరమైన ఫైట్ సీక్వెన్స్ కూడా ఈ సినిమా చూస్తున్న వాళ్లకు కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తాయి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్ట్ పర్ఫామెన్స్ విషయానికి వస్తే ధనుష్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించి మెప్పించాడనే చెప్పాలి. నిజానికి ధనుష్ ఒక మంచి నటుడు కానీ ఈ సినిమాలో మాత్రం తన నటవిశ్వరూపం చూపించాడనే చెప్పాలి. కొన్ని సీన్లలో అయితే చాలా మెచ్యుర్డ్ పర్ఫామెన్స్ ఇచ్చి సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశాడు. ఇక మన తెలుగు హీరో అయిన సందీప్ కిషన్ కూడా ఈ సినిమా లో ఒక పాత్ర చేశాడు. తను తన పాత్ర పరిధి మేరకు చాలా అద్భుతంగా నటించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఈ సినిమా కి చాలా కీలకం గా మారడమే కాకుండా ఆమె కూడా చాలా బాగా నటించింది. ఇక ఓవరాల్ గా ధనుష్ మాత్రమే ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు… మిగిలిన ఆర్టిస్టులంతా పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఏ ఆర్ రాహమాన్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకు ఎంత మాత్రం యాప్ట్ అవలేదు. అనవసరమైన సాంగ్స్ ఇచ్చాడని అనిపిస్తూ ఉంటుంది. ఇక బ్యా గ్రౌండ్ స్కోర్ లో కూడా అంత వైవిధ్యమైతే ఏమి చూపించలేదు. ఏఆర్ రెహమాన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నాం కానీ ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ఆయన మ్యూజిక్ చూస్తే ఆయనతో స్టఫ్ అయిపోయిందా అని అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతవరకు మనకు మళ్ళీ ఆ అనుమానం కలుగుతూనే ఉంటుంది… ఇక ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. ఈ సినిమాలో కొన్ని విజువల్స్ తీయడానికి వాడిన లైటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక కొన్ని సీక్వెన్స్ లలో ఆయన వాడిన షాట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి…ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉండడమే కాకుండా సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు అయితే చేశారు…

ప్లస్ పాయింట్స్

ధనుష్
కథ

మైనస్ పాయింట్స్

మ్యూజిక్
అనవసరమైన ఫైట్స్
బోరింగ్ సీన్స్

రేటింగ్
ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2/5

చివరి లైన్
ధనుష్ డైరెక్షన్ లో ఇంకా కొన్ని మెలుకువలు నేర్చుకోవాలి…