spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhanush Kara movie review : ధనుష్ 'కర' మూవీ మొట్టమొదటి రివ్యూ..మరోసారి హిట్ కొట్టాడా...

Dhanush Kara movie review : ధనుష్ ‘కర’ మూవీ మొట్టమొదటి రివ్యూ..మరోసారి హిట్ కొట్టాడా ? లేదా?

Dhanush Kara movie review : వరుస విజయాలతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ధనుష్(Dhanush K Raja), ఈ నెల 30 న ‘కర'(Kara Movie) అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై తమిళం లో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. అదే విధంగా తెలుగు లో కూడా రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కారణంగా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ చిత్రం పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం , ఆ కారణం చేత ఎదురైన పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ విగ్నేష్ రాజా. ఇందులో ధనుష్ ‘కర స్వామి’ గా కనిపించబోతున్నాడు. ఇతను బ్యాంకులకు కన్నాలు వేసి డబ్బులు దోచుకునే ఒక దొంగ.

చాలా రోజుల తర్వాత తన ఊరికి తిరిగి వస్తాడు. అతను తిరిగి వచ్చినందుకు కుటుంబ సభ్యులంతా సంతోషిస్తారు కానీ, ఊర్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇవి ఆయన కుటుంబానికి సరికొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ఇంతకీ కరస్వామి దొంగగా ఎందుకు మారాడు?, గల్ఫ్ దేశాల్లో జరిగిన యుద్దాలు కరస్వామి జీవితం పై ఎలాంటి ప్రభావం చూపించింది ? అనేది మిగిలిన స్టోరీ. స్టోరీ వింటుంటేనే ఎంతో ఆసక్తికరంగా ఉంది కదూ , సినిమాని కూడా అంతే అద్భుతంగా తీర్చి దిద్దడట డైరెక్టర్ విగ్నేష్ రాజా. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని చెన్నై లో ఏర్పాటు చేశారు. మూవీ టీం తో పాటు, కొంతమంది మీడియా ప్రముఖులకు కూడా ఈ సినిమాని స్క్రీనింగ్ చేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సోషల్ మీడియా లో వేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.

నిన్ననే ‘కార’ చిత్రాన్ని చూశానని , సినిమా చాలా బాగా వచ్చిందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విగ్నేష్ రాజా స్లో బిటింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడని , కచ్చితంగా ఈ చిన్నికి రాబోయే రోజుల్లో బాగా అడిక్ట్ అయిపోతారని అంటున్నారు. మరి ఆ రేంజ్ లో సినిమా ఉందొ లేదో చూడాలి. మీడియా సర్కిల్ లో కూడా ఈ చిత్రానికి ప్రివ్యూ షో నుండి మంచి టాక్ ఉంది. ఇదే టాక్ జనాల నుండి కూడా వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తమిళనాడు బాక్స్ ఆఫీస్ కూడా మన టాలీవుడ్ లాగానే డ్రై గా ఉంది. అత్యవసరంగా ఒక హిట్ లేకపోతే ఇండస్ట్రీ మనుగడ ప్రశ్నర్ధకం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మరి ‘కర’ చిత్రం ఆ పరిస్థితులను మారుస్తుందో లేదో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular